*జననేత్రం న్యూస్ భద్రాచలం నియోజకవర్గం ప్రతినిధి జూన్21*//:భద్రాచలం పట్టణ నడిబొడ్డులో ఉన్నటువంటి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం గత 40 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రస్తుతం అంబేద్కర్ విగ్రహం శిథిలావస్థలో ఉండి,ఎప్పుడు పడిపోతుందో తెలియని పరిస్థితిలో ఉన్నదని ఎమ్మెల్యేకి వివరించడం జరిగింది.
అదేవిధంగా అంబేద్కర్ నూతన విగ్రహం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ గతో మాట్లాడి ప్రభుత్వ నిధులతోనే అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే కి విన్నవించడం జరిగింది.
అదేవిధంగా పట్టణంలో ఉన్న బీసీ, ఎస్సీ,ఎస్టీ, మైనారిటీలు, వివిధ రాజకీయ పార్టీ నాయకులు మరియు అంబేద్కర్ అభిమానులతో ఒక కమిటీ ఏర్పాటు చేసి అంబేద్కర్ నూతన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరడం జరిగింది.
ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు స్పందిస్తూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ని గౌరవిస్తూ ప్రభుత్వ నిధులతోనే అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయుటకు కృషి చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో దళిత సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు ముద్దా పిచ్చయ్య, మాల మహానాడు జిల్లా అధ్యక్షులు దాసరి శేఖర్, బైండ్ల సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు మరియు సీనియర్ అడ్వకేట్ పడిసిరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


C.E.O
Cell – 9866017966
