జననేత్రంన్యూస్ మండలం దౌల్తాబాద్ మండలం ప్రతినిధి దుబ్బాక నియోజకవర్గం. జూన్22*//:దుబ్బాక, యోగ తోనే మానవుడికి మానసిక ఉల్లాసంతో పాటు ఆరోగ్యంగా ఉంటారని హిందూ ప్రియాయల్ అంగన్వాడి అంగన్వాడి కేంద్రం 3లో అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మనిషి పరిపూర్ణ ఆరోగ్యవంతంగా ఉండాలంటే యోగ తప్పనిసరి చేయాలని భారతీయులు పూర్వకాలం నుండి మనకు అందించిన అద్భుతమైన సంపద యోగా అన్నారు. ప్రపంచానికి యోగం నేర్పింది భారతీయులే అన్నారు.
మనిషిని పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దే ప్రధాన క్రియల లో యోగ 1 అన్నారు. మనసులోని ఆందోళన తగ్గించుకోవడంతో పాటు, జీర్ణ వ్యవస్థను, హృదయ స్పందన, నాడీ వ్యవస్థను చురుకుగా ఉంచేందుకు యోగ దోహదపడుతుందన్నారు.
నిత్యం యోగా చేస్తే ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా పెంటమ్మ మహిళలు, విద్యార్థులు తదితరులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.



C.E.O
Cell – 9866017966
