Home Latest News పోలీస్ అమరవీరుల కుటుంబాలకు ఇళ్ల పట్టాలు అందజేసిన డీజీపీ | బలిమెల ఘటన| మల్కన్‌గిరి జిల్లా| ఒడిశా| మావోయిస్టుల దాడి| పోలీసు అమరవీరుల కుటుంబాలు| అదనపు డీజీపీ విజయ్ కుమార్| SIB| IGP బి. సుమతి| గ్రేహౌండ్స్ కమాండర్ రాఘవేంద్ర రెడ్డి| | హైదరాబాద్ పోలీస్ సీఎం రేవంత్ రెడ్డి| డీజీపీ బి. శివధర్ రెడ్డి| సీపీ సజ్జనార్ – Jananethram News

పోలీస్ అమరవీరుల కుటుంబాలకు ఇళ్ల పట్టాలు అందజేసిన డీజీపీ | బలిమెల ఘటన| మల్కన్‌గిరి జిల్లా| ఒడిశా| మావోయిస్టుల దాడి| పోలీసు అమరవీరుల కుటుంబాలు| అదనపు డీజీపీ విజయ్ కుమార్| SIB| IGP బి. సుమతి| గ్రేహౌండ్స్ కమాండర్ రాఘవేంద్ర రెడ్డి| | హైదరాబాద్ పోలీస్ సీఎం రేవంత్ రెడ్డి| డీజీపీ బి. శివధర్ రెడ్డి| సీపీ సజ్జనార్ – Jananethram News

by Jananethram News
0 comments
news-logo


బలిమెల రిజర్వాయర్ లో మావోయిస్టులు దాడి చేసి 38 మందిని హత్య చేసిన ఆనాటి దారుణ మారణకాండ పోలీస్ యంత్రాంగానికి తీరని వేదనను మిగిల్చిందని జనరల్ ఆఫ్ పోలీస్ బి. శివధర్ రెడ్డి అన్నారు. బలిమెల సంఘటనలో అమరులైన పోలీసు కుటుంబ సభ్యులకు ఇళ్లస్థలాల పట్టాలను మంగళవారం నాడు డీజీపీ ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ….2008 జూన్ 29న మావోయిస్టులు జరిపిన ఆకస్మిక దాడిలో 32 మంది గ్రేహౌండ్స్ విభాగపు వీర జవాన్లు సహా మొత్తం 38 మంది మరణించిన సంఘటన రాష్ట్ర పోలీసు శాఖను విషాదంలో ముంచింది. ఆ సమయంలో తాను ఎస్ఐబీ డిఐజిగా బాధ్యతలు చేపట్టిన రెండు నెలల కాలంలోనే ఇటువంటి భారీ విషాదం ఎదురవ్వడం ఇప్పటికీ ఒక చేదు జ్ఞాపకంగా వెంటాడుతోందని డీజీపీ విచారం వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన ఆ వీరుల కుటుంబాలను అక్కున చేర్చుకోవాలనే ఆకాంక్షతో హైదరాబాద్ శివారులో భూమి కేటాయింపు కోసం చేసిన కృషి చాలా కాలం పాటు కొనసాగింది.

దాదాపు 18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు నేడు తెరపడటం పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. అమరవీరుల వారసులకు అండగా నిలవాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకోవడం వల్లే ఈ సమస్య పరిష్కారమైందని, బాధితులకు తగిన న్యాయం చేకూరిందని. ఇన్నేళ్ల తర్వాత అమరుల కుటుంబాల చిరకాల వాంఛను నెరవేర్చినందుకు తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖ తరపున, అమరుల కుటుంబ సభ్యుల పక్షాన ముఖ్యమంత్రికి డీజీపీ కృతజ్ఞతలు తెలియజేశారు.

2008 జూన్ 29న ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లా చిత్రకొండ వద్ద బలిమెల రిజర్వాయర్‌లో లాంచీపై వెళ్తున్న 60 మంది గ్రేహౌండ్స్ కమాండోలు, పోలీసులపై మావోయిస్టులు మెరుపుదాడి చేసిన విషయం విధితమే. కొండల పైనుంచి మావోయిస్టులు జరిపిన కాల్పులు, గ్రెనెడ్ల దాడిలో లాంచీ మునిగిపోయింది. ఈ దారుణ ఘటనలో 32 మంది గ్రేహౌండ్స్ కమాండోలు సహా మొత్తం 38 మంది మరణించారు. వీరి త్యాగానికి గుర్తింపుగా నాటి ప్రభుత్వం అమరవీరుల వారసులకు 200 గజాల చొప్పున ఇళ్లను కేటాయిస్తూ 2013లో జీవో నంబర్ 339 జారీ చేసింది. మొదట కుతుబుల్లాపూర్ మండలం గాజులరామారం గ్రామంలోని సర్వే నంబర్ 23, 27లలో రెండెకరాల భూమిని కేటాయించారు.

అయితే ఆ భూమిలో ఆక్రమణలు ఉండటంతో, ప్రత్యామ్నాయంగా అదే గ్రామంలో సర్వే నంబర్ 16లో 3.10 ఎకరాలను పేర్కొన్నారు. జీవోలో ఉన్న నంబర్లకు, క్షేత్రస్థాయిలో ఉన్న స్థలానికి మధ్య వ్యత్యాసంతో సర్వే ప్రక్రియలో అడ్డంకులు ఏర్పడ్డాయి. దీంతో అమరవీరుల కుటుంబాలు దాదాపు 13 ఏళ్లుగా పట్టాల కోసం ఎదురుచూడాల్సి వచ్చింది.ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం సూచనప్రాయంగా గత ఏడాది అక్టోబరు 18న సవరణ ఉత్తర్వులు (జీవో నం. 132) జారీ చేసింది. గాజులరామారంలోని సర్వే నంబర్ 16లో భూమి కేటాయింపును క్రమబద్ధీకరించింది. ఈ నేపథ్యంలో లబ్ధిదారులైన 33 వారలకు మంగళవారం నాడు డీజీపీ చేతుల మీదుగా అధికారికంగా ఇళ్ల స్థలాల పట్టాలు.

కార్యక్రమంలో ముందుగా గ్రేహౌండ్స్ అడిషనల్ డిజిపి అనిల్ కుమార్ మాట్లాడుతూ…. వివిధ కారణాల వల్ల గ్రేహౌండ్స్ అమరవీరుల కుటుంబ సభ్యులకు ఇళ్ల స్థలాల పంపిణీ ఆలస్యమైంది. సాంకేతిక కారణాల వల్ల ఇళ్ల స్థలాలు ఇచ్చిన ముఖ్యమంత్రికి , రెవిన్యూ అధికారులకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఇంటెలిజెన్స్ అడిషనల్ డిజిపి విజయ్ కుమార్, ఎస్‌ఐబి, ఐజిపి బి. సుమతి, గ్రేహౌండ్స్ కమాండర్ రాఘవేందర్ రెడ్డి, కుత్బుల్లాపూర్ ఎమ్మార్వో అశోక్ కుమార్ లతోపాటు అమరవీరుల కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

గ్రేహౌండ్స్ అధికారులకు ప్రత్యేక ఆపరేషన్ మెడల్స్

గ్రేహౌండ్స్‌లో ప్రతిభ కనబరిచిన నలుగురు అధికారులకు 2024 సంవత్సరానికి గాను ‘కేంద్రీయ గృహమంత్రి దక్షతా పదక్’ (స్పెషల్ ఆపరేషన్ మెడల్) లభించింది. గ్రూప్ కమాండర్ జాజాల రాఘవేందర్ రెడ్డి, సీనియర్ కమాండోలు తిప్పని రాకేష్, ఉడుతనూరి మల్లయ్య, జూనియర్ కమాండో గంటా సాయి కుమార్ ఈ పురస్కారాలకు ఎంపికైన సందర్భంగా వారిని డిజిపి అభినందించారు.

You may also like

Leave a Comment

Jananethram News delivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, Swendaily.com is your trusted source for timely and reliable news

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird