
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించిన విచారణ ఈరోజు సోమవారం సీబీఐ ప్రత్యేక కోర్టులో జరిగింది. విచారణ సందర్భంగా కేసుకు సంబం ధించిన అన్ని పత్రాలు, వివరాలను నిందితులకు అందజేశామని సీబీఐ అధికారులు కోర్టుకు తెలియజేసారు.ఈ సందర్భంగా కేసు వివరాలను తమకు అందినట్లుగా అఫిడవిట్ దాఖలు చేయాలని నిందితుల తరుపు న్యాయవాదులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
అయితే సీబీఐ అందజేసిన కేసు పత్రాలను పూర్తిగా పరిశీలించేందుకు కొంత సమయం అవసరమని నిందితుల తరఫు న్యాయవాదులు కోర్టును నిర్దేశించారు. నిందితుల అభ్యర్థనను పరిగణలోకి తీసుకున్న సీబీఐ కోర్టు ఈ నెల 19వ తేదీ లోపు కేసు వివరాలు అందినట్లు అఫిడవిట్ దాఖలు చేసినట్లు స్పష్టం చేసింది. కేసు తదుపరి గురువారం వరకు వాయిదా వేస్తూ కోర్టు విచారణకు ఆదేశాలు జారీ చేసింది. వివేకానంద రెడ్డి హత్య కేసు రాజకీయంగా కూడా ప్రాధాన్యత పొందిన నేపథ్యంలో ఈ కేసు విచా రణపై రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి చూపింది.

C.E.O
Cell – 9866017966

