Home Latest News కళ్లల్లో కారం కొట్టి రూ.21 కోట్లు దోపిడీ.. కూకట్ పల్లిలో సంచలన ఘటన | రూ. 21 కోట్లు కొల్లగొట్టారు| #కూకట్‌పల్లి| మిరియాలు| కళ్ళు| హవాలా – Jananethram News

కళ్లల్లో కారం కొట్టి రూ.21 కోట్లు దోపిడీ.. కూకట్ పల్లిలో సంచలన ఘటన | రూ. 21 కోట్లు కొల్లగొట్టారు| #కూకట్‌పల్లి| మిరియాలు| కళ్ళు| హవాలా – Jananethram News

by Jananethram News
0 comments
news-logo


హైదరాబాద్‌ కూకట్‌ పల్లిలో భారీ దోపిడీ సంచలనం సృష్టించింది. భారీ మొత్తంలో నగదు ఉన్న బాక్సును బైకు పై తరలిస్తుండగా ఈ దోపిడీ జరిగింది. నగదు తరలిస్తున్న బైక్ ను వెంబడించిన దుండగులు ఆ బైక్ నడుపుతున్న వ్యక్తి కళ్లల్లో కారం కొట్టి నగదు ఉన్న బాక్సును దోచుకెళ్లారు. ఈ సంఘటన కూకట్ పల్లి మెట్రో పిల్లర్ 836 వద్ద జరిగింది. మొదట దోపిడీకి గురైన సొత్తు కోటి రూపాయలుగా భావించారు. అంత పెద్ద మొత్తంలో బైక్ పై తరలించడమేంటన్న అనుమానంతో నగదు తరలిస్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సొమ్ము హవాలా సొమ్ముగా.

పోలీసుల దర్యాప్తులో బయటపడిన వివరాల ప్రకారం ఈ హవాలా వ్యవహారం పూర్తిగా సినిమా ఫక్కీలో జరిగింది. కేవలం రూ.10 నోటును గుర్తుగా చూపించి భారీ మొత్తంలో నగదు మార్పిడి జరిపినట్లు తెలుస్తోంది. పోలీసులు ఈ సందర్భంగా నగదు తరలిస్తున్న అజీముద్దీన్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

అమీర్‌కు పది రూపాయల నోటు ఇచ్చి కూకట్‌పల్లిలో పవన్ అనే వ్యక్తికి అందజేసే యాలని సూచించాడనీ, ఆ నోటును చూపించిన తర్వాత పవన్ ఇచ్చే నగదును తీసు కుని ఇబ్రహీంకు అందజేస్తానని చెప్పారు. దీంతో తాను కుష్రో కలిసి సోమవారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో కూకట్‌పల్లికి చేరుకుని పవన్‌ని సంప్రదించగా, గోకుల్ ఎన్‌క్లేవ్ వద్దకు రావాలని చెప్పాడు. అక్కడ రూ.10 నోటు చూపించగానే కార్టన్ బాక్సుల్లో రూ.21 కోట్ల నగదును అందజేశారని అజీముద్దీన్ పోలీసులకు వెల్లడించాడు.

ఆ నగదును తీసుకుని ఇబ్రహీంకు కాల్ చేయగా.. మరో ప్రదేశానికి రావాలని సూచించినట్లు తెలిపారు. ఈ బైక్‌పై ప్రయాణిస్తున్న సమయంలో పైలర్ నెంబర్ 836 వద్దకు రాగానే, రెండు బైకుల్లో వచ్చిన దుండగులు తమపై కారం పొడి చల్లి దాడి చేసి… కత్తులతో బెదిరించి మొత్తం నగదును దోచుకుని పరారయ్యారని తెలిపారు. కాగా ఈ కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు దోచుకున్న సొమ్ముతో పరారైన వ్యక్తులను శంషాబాద్ విమానాశ్రయంలో అరెస్టు చేశారు. వారు లక్నోకు పారిపోవడానికి ప్రయత్నించినప్పుడు, సీఐఎస్ఎఫ్ సిబ్బంది సహకారంతో ఇద్దరిని అదుపులో తీసుకున్నారు. పరారైన మిగిలిన నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు. ఈ కేసులో హవాలా లావాదేవీలు, అంతర్జాతీయ లింకులు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

You may also like

Leave a Comment

Jananethram News delivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, Swendaily.com is your trusted source for timely and reliable news

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird