

టాలీవుడ్ వెండితెరపై మరో స్టార్ వారసుడు అడుగుపెట్టబోతున్నాడు. సినిమా రంగంలో ‘ఇండియన్ మైఖేల్ జాక్సన్’గా నీరాజనాలు అందుకున్న భారతీయ ప్రభుదేవా(ప్రభుదేవా) తనయుడు రిషిల్ రాఘవేంద్ర దేవా త్వరలో హీరోగా పరిచయం కాబోతున్నాడు. ఈ మెగా లాంచ్ వెనుక ఒక క్రేజీ కాంబినేషన్ ఇప్పుడు ఫిలిం వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్(శేఖర్ మాస్టర్) ఈ సినిమా ద్వారా దర్శకుడిగా మెగా ఫోన్ పట్టబోతుండటం విశేషం. ఇప్పటివరకు వెండితెరపై తన స్టెప్పులతో ప్రేక్షకులను ఉర్రూతలూగించిన శేఖర్ మాస్టర్, ఇప్పుడు ప్రభుదేవా వారసుడిని వెండితెరకు పరిచయం చేసే బాధ్యతను భుజాన వేసుకున్నారట. ఓ వైపు ప్రభుదేవా కొడుకు హీరోగా ఎంట్రీ, మరోవైపు శేఖర్ మాస్టర్ డైరెక్టర్ గా ఎంట్రీ అవుత.. ఈ ప్రాజెక్ట్ పై అంచనాలు భారీగా ఉన్నాయి.
సుందరం మాస్టర్ వారసుడిగా వచ్చిన ప్రభుదేవా, అటు డాన్సర్‌గా, ఇటు నటుడిగా, దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేక సామ్రాజ్యాన్ని సృష్టించారు. ఇప్పుడు ఆ కుటుంబం నుంచి మూడవ తరం వారసుడిగా రిషిల్ ఇండస్ట్రీలోకి వస్తే అటు ఫ్యాన్స్‌లోనూ, ఇటు ఇండస్ట్రీలోనూ ఆసక్తి. రిషిల్ చూడటానికి అచ్చం తండ్రి ప్రభుదేవాలానే ఉండటం ఈ సినిమాకు మరో ఆకర్షణ.

ఈ సినిమా కథాంశం ప్రధానంగా మ్యూజిక్, డాన్స్ నేపథ్యంలో సాగుతుందని సమాచారం. ఒక డాన్స్ మాస్టర్ కొడుకును మరో స్టార్ కొరియోగ్రాఫర్ డైరెక్ట్ చేస్తాడని, సినిమాలో అదిరిపోయే డాన్స్ మూమెంట్స్ ఉండబోతున్నాయని అర్థమవుతోంది. గతంలో ప్రభుదేవా, లారెన్స్ వంటి కొరియోగ్రాఫర్లుగా ఉండి దర్శకులుగా మారి సక్సెస్ అయ్యారు. ఇప్పుడు శేఖర్ మాస్టర్ కూడా అదే బాటలో పయనిస్తున్నారు.
సోషల్ మీడియాలో ఈ వార్త తెలియగానే నెటిజన్లు రిషిల్‌కు ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు. “ప్రభుదేవా కొడుకు అంటే డాన్స్ మామూలుగా ఉండదు” అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. శేఖర్ మాస్టర్ టేకింగ్ ఎలా ఉండబోతుందో అని సినీ ప్రియులు ఆత్రుతగా ఉన్నారు.
ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ చిత్రం, మే నెల నుంచి రెగ్యులర్ షూటింగ్‌కు వెళ్లే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల పూర్తి వివరాలను త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు. మొత్తానికి ఒక సెన్సేషనల్ లాంచ్ కోసం టాలీవుడ్ సిద్ధమవుతోందని చెప్పవచ్చు.

C.E.O
Cell – 9866017966
