

-రష్మిక, విజయ్ ఇప్పుడు ఏం చేస్తున్నారు
-ఇప్పుడెందుకు రష్మిక పోస్ట్ చేసింది
-సదరు పోస్ట్ ఆంతర్యమేంటి!
ప్రేమ సఫలమై పెళ్లి చేసుకున్న జంట మనస్ఫూర్తిగా ఎంత ఆనందంగా ఉంటుందో విజయ్(Vijay deverakonda),రష్మిక(Rashmika)దేవరకొండని చూస్తే అర్ధం అవుతుంది. వివాహం రోజుకి ముందు నుంచే పలు రకాల ఫంక్షన్స్ ని ఏర్పాటు చేసి సంతోషకరమైన క్షణాలు తమ నుంచి దూరం కాకుండా లైఫ్ లాంగ్ తోడుండాలనే ఆకాంక్ష వాళ్ళ ముఖాల్లో స్పష్టంగా కనిపించింది. ఈ హల్ది వేడుక కూడా జరుపుకున్నారు. అందుకు సంబంధించి జరిగిన ఒక సంఘటన గురించి రష్మిక రీసెంట్ గా పోస్ట్ చేసింది. ఇప్పుడు ఆ పోస్ట్ విజయ్, రష్మిక మధ్య ఉన్న అండర్ స్టాండ్ కి ప్రతిరూపంగా నిలుస్తోంది. మరి అదేంటో చూద్దాం.
రష్మిక ఎక్స్ వేదికగా తన పోస్ట్ లో హల్దీ వేడుక హోలీ ని తలపించింది. నా జుట్టుపై పడిన రంగు ఇప్పటికి పోలేదు. ఆ రోజు నిర్వహించిన అన్ని పోటీల్లో నేనే గెలిచాను. నా టీం సహకారం వల్లే అది సాధ్యమైంది. విజ్జు కూడా నా టీంనే అని. ఈ విషయంపై అభిమానులు సోషల్ మీడియా వేదికగా ‘రష్మిక, విజయ్ నిజంగా గ్రేట్. పోటీల్లో అపోజిట్ గా ఉండకుండా ఓకే జట్టులో ఆడి గెలవడం చూస్తుంటే ఇద్దరు సరదాగా కూడా ప్రత్యర్థులుగా ఉండటానికి ఇష్టపడలేదనే వ్యాఖ్యలు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: ఉస్తాద్ భగత్ సింగ్: ఉస్తాద్ ఊచకోత స్టార్ట్.. ఆ ఏరియాలో రికార్డుల వేట
ఇక ఈ ఇద్దరు అభిమానుల ఆనందాన్ని మరింత రెట్టింపు చేసేలా ‘రణబలి’ మూవీలో జంటగా చేస్తున్నారు. పెళ్లి తర్వాత వస్తున్న మూవీ కావడంతో అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో చెప్పక్కర్లేదు. ఆ కాంబోలో వస్తున్న మూడవ సినిమా ఇద్దరి రణబలి.
