
హోర్ముజ్ జలసంధిలో ఇంధన నౌకల రవాణాపై ఇరాన్ ఆంక్షలతో అమెరికా తీవ్ర ఆందోళనకు గురవుతోంది. ఆ కావలసిన హోర్ముజ్ జలసంధిని రక్షించుకునేందుకు, ఇంధన రవాణాను క్రమబద్ధీకరించేందుకు ముందుకు రావాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన పిలుపునకు చైనా స్పందించింది. హోర్ముజ్ రక్షణ కోసం ముందుకు వస్తామని, అయితే ముందుగా పశ్చిమాసియాలో సైనిక కార్యకలాపాలను వెంటనే నిలిపివేయాలని చైనా షరతు పెట్టింది. ఈ మేరకు చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి లిన్ జియాన్ ఓ ప్రకటన విడుదల చేశారు.
పశ్చిమాసియాలో ఘర్షణల వల్ల అంతర్జాతీయ ఇంధన ప్రవాహం, ప్రాంతీయ శాంతి, స్థిరత్వం దెబ్బతింటున్నాయని లిన్ జియాన్ అన్నారు. ఉద్రిక్తతలు లేకుండా ఉండేందుకు చర్యలు అమెరికాకు పెరగాలని ఆయన సూచించారు. ప్రస్తుతం జరుగుతున్న ఘర్షణలు ఆగితేనే ప్రాంతీయ స్థిరత్వం సాధ్యమవుతుందని అన్నారు. మార్చి నెల చివర్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాలో ఉండాల్సి ఉంది. ప్రస్తుతం ట్రంప్ బీజింగ్ పర్యటన గురించి అమెరికాతో చర్చలు జరుగుతున్నాయని లిన్ జియాన్ అన్నారు.
ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు మెరుగుపరుచుకోవడంలో ట్రంప్ పర్యటన కీలకం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. చైనా పర్యటన గురించి ట్రంప్ తాజాగా మాట్లాడుతూ.. హోర్ముజ్ జలసంధి రక్షణ విషయంలో చైనా సమాధానాన్ని బట్టి తన పర్యటన షెడ్యూల్ ప్రకారం ఉంటుందా.. వాయిదా పడుతుందా అనే విషయంలో నిర్ణయం తీసుకుంటానన్నారు.

C.E.O
Cell – 9866017966

