Home Latest News అల్లం-వెల్లుల్లి పేస్ట్ పేరుతో ‘పాయిజన్ ప్యాక్’ | ఆహార భద్రత|Police Raid| ఒక సహారా గోల్డ్ అల్లం వెల్లుల్లి పేస్ట్| బోరబండ| మధుర నగర్| అల్లం-వెల్లుల్లి పేస్ట్| ఆహార భద్రత అధికారులు| GHMC| సీఎం రేవంత్ రెడ్డి| డీజీపీ బి. శివధర్ రెడ్డి| సీపీ సజ్జనార్ – Jananethram News

అల్లం-వెల్లుల్లి పేస్ట్ పేరుతో ‘పాయిజన్ ప్యాక్’ | ఆహార భద్రత|Police Raid| ఒక సహారా గోల్డ్ అల్లం వెల్లుల్లి పేస్ట్| బోరబండ| మధుర నగర్| అల్లం-వెల్లుల్లి పేస్ట్| ఆహార భద్రత అధికారులు| GHMC| సీఎం రేవంత్ రెడ్డి| డీజీపీ బి. శివధర్ రెడ్డి| సీపీ సజ్జనార్ – Jananethram News

by Jananethram News
0 comments
news-logo


హైదరాబాద్‌లో మరోసారి “లాభాల కోసం ప్రాణాల మీద ఆట” బయటపడింది. బయటకు చూస్తే “ఏ వన్ సహారా గోల్డ్ జింజర్ గార్లిక్ పేస్ట్” అంటూ బ్రాండెడ్ లుక్… కానీ లోపల మాత్రం కల్తీ కథ!

బోరబండలో నడుస్తున్న ఈ అక్రమ వ్యాపారం అసలు రూపం బయటపడటంతో ప్రజలు షాక్ అవుతున్నారు. ఖైరతాబాద్ జోన్ టాస్క్ ఫోర్‌స్‌కు అందిన విశ్వసనీయ సమాచారంతో మధుర నగర్‌లోని గోదాముపై దాడి జరగలేదు… అక్కడి పరిస్థితులు చూస్తే “ఇది ఫుడ్ ఫ్యాక్టరీనా? లేక చెత్త గోదామా?” అన్న సందేహం కలుగుతోంది.

ప్లాస్టిక్ డబ్బాల్లో అల్లం-వెల్లుల్లి పేస్ట్ తయారీ… చుట్టూ దుమ్ము, ఈగలు, అపరిశుభ్రత—ఇదే అక్కడి ‘క్వాలిటీ కంట్రోల్’! అంతేకాదు… పేస్ట్‌లో అసిటిక్ యాసిడ్, ఉప్పు కలిపి రుచి పెంచుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఇంకా మిగిలిపోయిన వెల్లుల్లి తొక్కలనే ముడి పదార్థంగా వాడటం చూసి అధికారులు కూడా ఆశ్చర్యపోయారు.

ఈ కల్తీ పేస్ట్‌ను ఈరోజు హోటళ్లు, కేటరింగ్ సర్వీసులు, కిరాణా ఉత్పత్తులకు సరఫరా చేస్తూ… ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి భారీగా లాభాలు ఆర్జిస్తున్న నిందితుడు మహ్మద్ అబ్దుల్లా. పేరుకు FSSAI లైసెన్స్ ఉన్నా… నాణ్యత మాత్రం పూర్తిగా నిర్లక్ష్యం!

దాడిలో అధికారులు సుమారు రూ. 4.5 లక్షల విలువైన కల్తీ పేస్ట్, ముడి సరుకు, మొత్తం స్వాధీనం చేసుకున్నారు. వేల కిలోల వెల్లుల్లి, ఉప్పు బస్తాలు కనిపించడం వల్ల ఇది చిన్న స్థాయి వ్యాపారం కాదని స్పష్టమవుతోంది.ఇలాంటి కల్తీ వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే… “రుచి కోసం కొనేది, ఆరోగ్యానికి ముప్పు అవుతుందేమో” అనే భయం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

You may also like

Leave a Comment

Jananethram News delivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, Swendaily.com is your trusted source for timely and reliable news

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird