
.webp)
ఎన్టీఆర్ జిల్లా, మైలవరం దేవునిచెరువు తారకరామా నగర్ మండల పరిషత్ ఆదర్శ పాఠశాలను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇటీవల మధ్యాహ్న భోజనం బాగాలేదంటూ పాఠశాల హెచ్‌ఎం డ్రామా ఆడిన ఘటన నేపథ్యంలో మంత్రి ఆకస్మిక తనిఖీ జరిగింది. విద్యార్థులకు వడ్డిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని నాణ్యతను పరిశీలించారు. కొత్తగా ఏర్పాటు చేసిన కాంట్రాక్టర్ ఆఫర్ భోజనంపై విద్యార్థుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. భోజనం బాగుందని విద్యార్థులు చెప్పారు.
ఘటన జరిగిన రోజు, అంతకుముందు భోజనం ఎలా ఉందంటే విద్యార్థులను మంత్రి అడిగారు. భోజనం బాగాలేకపోతే ముందు తల్లిదండ్రులకు చెప్పాలని సూచించారు. ఆ తర్వాత భోజనంపై లీప్ యాప్ ద్వారా తల్లిదండ్రుల అభిప్రాయాలు తెలుసుకుంటామని చెప్పారు. ఇంకోసారి తప్పు జరగకుండా చూస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఇటీవల మధ్యాహ్న భోజనం సరిగా లేదంటూ విద్యార్థులు డస్ట్ బిన్ లో పడేసిన ఘటనపై సిబ్బంది ఆరా తీశారు. భోజనం సిద్ధమయ్యాక ప్రతిరోజూ ఒక ఉపాధ్యాయుడు నాణ్యత ఉన్నారా అని వాకబు చేశారు. విద్యార్థులకు ఏమైనా సమస్యలు ఉన్నాయా అని ప్రశ్నించారు.
తప్పు పునరావృతం అయితే కఠిన చర్యలు తప్పవు
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మీపై పవిత్ర బాధ్యత ఉంది. చిన్న సమస్య ఉన్నా తెలుసుకోవాలి, పరిష్కరించాలి. తప్పు పునరావృతం అయితే కఠిన చర్యలు తప్పవని, నిర్లక్ష్యంగా ఎవరూ వ్యవహరించకూడదని మంత్రి సూచించారు. భోజనంపై వారి ప్రతివారం తల్లిదండ్రులకు ఫోన్ చేయాలని, ఐవీఆర్‌ఎస్ ద్వారా ఫీడ్ బ్యాక్‌ను తీసుకోవాలని. పాఠశాలలో విద్యాబోధన తీరు, పాఠశాల పరిసరాలు, రికార్డులను పరిశీలించారు. ప్రతి పాఠశాలతోపాటు తనకు ముఖ్యమేనని, అడ్మిషన్ల పెంపుతో విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాల మెరుగుదల చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం పాఠశాలలో ఉన్న అంగన్ వాడీ కేంద్రాన్ని మంత్రి సందర్శించారు. విద్యార్థులకు అందుతున్న ఆహారాన్ని, అంగన్ వాడీ కేంద్రం శుభ్రతను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.
మైలవరం ఘటన నేపథ్యంలో విద్యార్థులకు అందే మధ్యాహ్న భోజనం పథకంపై ఇటీవల సమీక్షించిన మంత్రి పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం నాణ్యంగా లేకపోతే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. భోజనం సిద్ధమయ్యాక ప్రతిరోజూ ఒక ఉపాధ్యాయుడు నాణ్యతను పరిశీలించాలని, బాగుందని నిర్థారించాకే విద్యార్థులకు పెట్టాలని. వారంలో ఒకరోజు ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గంలో ఒక పాఠశాలలో విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేయాలన్నారు. భోజనం గురించి విద్యార్థులు చెబితే తల్లిదండ్రులు వెంటనే లీప్ ద్వారా ఫిర్యాదులు, సూచనలు అందించాలని యాప్ విజ్ఞప్తి చేశారు. సమూల మార్పు కోసం త్వరలోనే సెంట్రలైజ్డ్ కిచెన్ వ్యవస్థను యుద్ధప్రాతిపదికన ఏర్పాటుచేయాలని.

C.E.O
Cell – 9866017966
