*జననేత్రం న్యూస్ ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో జూన్17*//: ఖమ్మం : జిల్లా కలెక్టర్ గా సుమారు ఏడాది కాలం పాటు విధులు నిర్వర్తించిన ముజమ్మిల్ ఖాన్ పాలనలో తనదైన ప్రత్యేకతను చాటుకున్నారని తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి క్యాంపు కార్యాలయ ఇన్ చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి పేర్కొన్నారు. బదిలీపై వెళ్తున్న ముజమ్మిల్ ఖాన్ ను ఖమ్మంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో దయాకర్ రెడ్డి మంగళవారం కలిసి ఆయన సేవలను కొనియాడుతూ బొకే ఇచ్చి శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా దయాకర్ రెడ్డి మాట్లాడుతూ…. జిల్లాలో బాధ్యతలు చేపట్టిన రోజు నుంచి బదిలీ అయ్యేంత వరకు నిబద్ధతతో పనిచేశారని కొనియాడారు. భవిష్యత్తులో ఉన్నతస్థాయికి ఎదగాలని ఆకాంక్షిస్తున్నట్లు ఈ సందర్భంగా పేర్కొన్నారు.


C.E.O
Cell – 9866017966
