

ఆకాశమే హద్దుగా ఇంత కాలం పెరుగుతూ వచ్చిన బంగారం, వెండి ధరలు ఇప్పుడు యూ టర్నర్ తీసుకుంటున్నాయి. గత కొద్ది రోజులుగా పసిడి, వెండి ధరలు భారీగా పడిపోతున్నాయి. గురువారం (మార్చి 19) పసిడి ధరలు భారీగా తగ్గాయి. అదే దారిలో వెండి రేట్లు కూడా పతనమయ్యాయి.
గురువారం (మార్చి 19) హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.1,50,280కి చేరుకుంది. అంటే ఒక్క రోజులోనే రూ.7140 మేర తగ్గింది. అలాగే.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,37,750 లకు చేరుకుంది. ఇది ఒక్క రోజులోనూ రూ.6550ల మేర తగ్గింది. మరోవైపు వెండి ధరలు కూడా దిగివస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర ప్రస్తుతం రూ.2.60 లక్షలుగా ఉంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర ప్రస్తుతం రూ.2.65 లక్షలుగా ఉంది.

C.E.O
Cell – 9866017966
