*ప్రభుత్వం మారినా తీరు మారని ఇసుక మాఫియా రూటు*
*నిద్రావస్థలో ప్రభుత్వ యంత్రాంగం*
జననేత్రంన్యూస్ఏప్రిల్06//:ఖమ్మం జిల్లాలో ఇసుక మాపియా రెచ్చిపోతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటికీ ఇసుక మాఫియా మాత్రం మూడు పువ్వులు ఆరుకాయలుగా విరాజిల్లుతొంది. కోట్లరూపాయల్లోఇసుక అక్రమంగా తరులు తున్నా ప్రభుత్వ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్వవహరిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ భూముల్లో ఇసుక ట్రాక్టర్లద్వారా నగర పరిసర ప్రాంతాల మీదుగా వెళ్తున్న వాటిని పట్టుకునే నాదుడే కరువయ్యాడన్న విమర్శలు ఉన్నాయి. ప్రధానంగా జిల్లా లోని ఖమ్మం నగరం మున్నేరు నడిబొడ్డు నుండి భారీగా ఇసుక అక్రమ రవణా నిత్యం జరుగుతూనే ఉంటుంది. ఈ వ్యవహారం అధికారుల కు తెలిసినా తమకెందుకులే అన్న కోణంలో వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. కనుక మాఫియాకు రాజకీయబలం తోడుకావడంతో వారి వ్యాపారం చక్కగా సాగిపోతుంది. ఇసుక అక్రమార్కులు ప్రభుత్వ నిబంధనల గాలికి వదిలి అక్రమ రవాణా చేస్తుండడంతో ఇసుక వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా విరజిల్లుతుంది. రెవిన్యూ పోలీస్ స్పెషల్ స్కాడ్ లను ఏర్పాటు చేసిన, కంచే చేను మేసిన చందంగా ఉందని ప్రజలు మండిపడుతున్నారు.
ఇసుక మాఫియా యదేచ్చగా ప్రతినిత్యం పదుల -సంఖ్యలో ట్రాక్టర్ల ద్వారా ఇసుకని అక్రమంగా వివిధ ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు .అక్రమ ఇసుకను నిరోదించటములో ఆయా అధికారులు మీన మేషాలు లెక్కించడం చూస్తుంటే, అక్రమ ఇసుక వ్యాపారం అధికారులు భాగస్వామ్యం తోనే జరుగుతున్నాయని. వారి తీరు చూస్తే కంచె చేనుని మేసిన చందంగా ఉందని ప్రజలు మండిపడుతున్నారు.తిలా పాపం తలా పిడికేడు అన్న సమేత లా పర్యవేక్షణ చేయాల్సిన అదికారులు సైతం ఇసుక మాపియాకు సహకారం అందిస్తూ మామూళ్ల మత్తు లో జోగుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు ప్రత్యేకంగా స్పందించి అక్రమ ఇసుక రవణాకు అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు.
ప్రభుత్వం మారినా ఇసుక దందా మారటం లేదని మాఫియా కోట్లకు పడుగలెత్తుతున్నారని పలువురు పేర్కొంటున్నారు.ఇసుక అక్రమార్కులకు అడ్డుకట్ట వేసీ ప్రకృతి సంపదను కాపాడాలని ప్రజలు కోరుకుంటున్నారు.






C.E.O
Cell – 9866017966
