
జలమే సంపద… దాన్ని ఎంత పొదుపుగా వినియోగించుకుంటే అంత సంపదను సృష్టించినట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. ‘జలధార’తో రాష్ట్రంలోని ప్రతీ ఎకరాకునీరు అందజేసేలా జలహారతి కార్యాచరణ చేపడదామని. అనంతపురం జిల్లా, యాడికిలో ‘జలధార..నీటి భద్రత-సాగు నీటి సంఘాల బాధ్యత’ అనే కార్యక్రమంలో పాల్గొని 100 రోజుల యాక్షన్ ప్లాన్‌ను ముఖ్యమంత్రి విడుదల చేశారు. అనంతరం నీటి భద్రత-సాగునీటి సంఘాల బాధ్యత పేరుతో రూపొందించిన యాప్‌ను చంద్రబాబు ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ….నీరు మనందరికీ సర్వస్వమని, నీటిని సంరక్షించుకోడానికే వంద రోజుల యాక్షన్ ప్లాన్ చేశామని ముఖ్యమంత్రి అన్నారు. ‘రాష్ట్ర వ్యాప్తంగా నీటి భద్రత కోసమే పనిచేస్తున్నాం. పరిగెత్తే నీటిని నిలబెట్టాలి, నిలబడిన నీటిని నిల్వ చేయాలి..నిలబడిన నీటిని జలాశయం కోసం ప్రయత్నించాలి. నీటి సంరక్షణకు ఇంకుడు గుంతలు, చెక్ డ్యామ్‌లు, తుంపర సేద్యం, సూక్ష్మసేద్యం లాంటి అనేక ప్రయత్నాలు చేసి ముందుకు వెళ్లాం. పంట కుంటలు, కాలువలు, చెరువుల్లో మట్టి తీసి పొలాలకు వేశాం. ఎన్టీఆర్ జలసిరి ద్వారా ట్రెంచ్‌లు, నీరు చెట్టు, నీరు-మీరు, నీరు-ప్రగతి లాంటి అనేక కార్యక్రమాలు చేపట్టాం. నీటి భద్రతా కార్యక్రమంలో రైతులు, సాగునీటి సంఘాలు లాంటి భాగస్వాములతో ఈ తరహా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు.
అనంతపురం లాంటి ప్రాంతాల్లో కొన్ని ఏళ్లపాటు నీరే లేదు. నష్టపోతున్న రైతులను ఆదుకోడానికి ఇన్ పుట్ సబ్సిడీ ఇచ్చింది కూడా టీడీపీనే. అనంతపురం జిల్లాలో నీటిని సద్వినియోగం చేసుకోవాలని డ్రిప్ ఇరిగేషన్ కార్యక్రమం అందించాం. 90 శాతం మేర సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్ పరికరాలను కూడా గతంలో మేమే ఇచ్చింది. మైక్రో ఇరిగేషన్‌పై గతంలో ఇచ్చిన నివేదిక ప్రామాణికంగా మారి దేశంలో అంతా వినియోగించే పరిస్థితి వచ్చింది. ప్రస్తుత మైక్రో ఇరిగేషన్‌లో రూ.1,031 కోట్లు ఖర్చు చేస్తూ దేశంలో నెంబర్ వన్‌గా ఉంది. డ్రిప్ ఇరిగేషన్ వల్లే రాయలసీమ హార్టికల్చర్ హబ్‌గా మారింది. హార్చికల్చర్‌లో దేశంలో అగ్రస్థానంలో ఉన్నాం’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
పూర్వోదయతో సీమ అభివృద్ధి
రాయలసీమ అభివృద్ధికి ఒక ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తున్నామని, కేంద్రం ప్రవేశపెట్టిన పూర్వోదయ పథకం ద్వారా రూ.30 వేల కోట్లు వస్తాయన్నారు. ‘పెట్టుబడులు ద్వారా మరో రూ.70 వేల కోట్ల రాబట్టి అభివృద్ధి చేస్తాం. గడిచిన 21 నెలల్లో నీటి భద్రతాపరంగా చాలా మార్పులు వచ్చాయి. చెరువులు పెద్ద ఎత్తున నింపగలిగాం. జల సంరక్షణ చర్యల కారణంగా భూగర్భ జలాలను 1.92 మీటర్ల మేర అదనంగా పెంచగలిగాం. గత వేసవి ఏడాది ముందు 8, వేసవి తర్వాత 3 మీటర్లుగా భూగర్భజలాలు ఉన్నాయి. అనంతపురం జిల్లాలో గతంలో 13 మీటర్ల మేర ఉంటే ఇప్పుడు 11 మీటర్లకే భూగర్భ జలాలు అందుబాటులోకి వచ్చాయి.
చేపట్టిన భూసంరక్షణ చర్యల కారణంగా 2.2 మీటర్ల మేర జలాలు పెరగడం కలిగిస్తోంది. అన్నమయ్య జిల్లాల్లో దీనిని ఓ ప్రజాఉద్యమంగా చేపట్టి విజయం సాధించారు. ఈ ఉద్యమంలో ప్రజలందరికీ నేను తోడుగా ఉంటాను. జిల్లాలో 5.7 టీఎంసీల నీళ్లు వచ్చాయి. 20 వేలకుపైగా ఎండిన బోర్లలో నీరు అందుబాటులోకి వచ్చింది. ఒక్క జిల్లాలో రూ.96 కోట్ల మేర విద్యుత్ ఆదా అయ్యింది. భూగర్భజలాలు పెరగడం మూలంగా హరిత ప్రాంతం పెరిగింది. అన్ని సానుకూలమైన అంశాలు’ అని ముఖ్యమంత్రి అన్నారు.
రబీ, ఖరీఫ్‌కు సమృద్ధిగా నీరు
వర్షాకాలం కంటే ముందు 6 మీటర్ల లోతున, ఆ తర్వాత 3 మీటర్ల కంటే తక్కువగా భూగర్భ జలాలు అందుబాటులో ఉండేలా చూడాలని ముఖ్యమంత్రి అన్నారు. రాష్ట్రంలో నీటి ఎద్దడి లేకుండా చేయవచ్చని అన్నారు. ”రిజర్వాయర్లలో నీళ్లు నిండుగా ఉంటే మనం వినియోగించుకునే అవకాశం ఉంటుంది. శ్రీశైలం ఎక్కడెక్కడో ఎత్తిపోతల పథకాలు ఏర్పాటు చేసి నీరు తెచ్చుకుంటున్నాం. రాష్ట్రంలోనూ, రాయలసీమలోనూ ప్రతీ ఎకరాకూ నీరు బాధ్యత ఇచ్చే ప్రభుత్వం తీసుకుంటుంది. రాష్ట్రవ్యాప్తంగా ఒక్క ఖరీఫ్‌కు 547 టీఎంసీలు, రబీకి 343 టీఎంసీలు, పరిశ్రమలకు 28, ఈసారి 158 టీఎంసీల నీరు అవసరం అవుతుంది. మొత్తంగా 1300 టీకాల వరకూ నీటి అవసరం ఉంటుంది.
ఈ ఏడాదిలో 74 టీకాల నీరు అనంతపురం వరకూ తీసుకువచ్చాం. హంద్రీనీవా ద్వారా చిట్టచివరి భూములకు కూడా నీరు తీసుకెళ్లాం. పట్టిసీమ నుంచి కృష్ణా డెల్టాకు తీసుకొచ్చి రబీకి, ఖరీఫ్‌కు ఇచ్చే నీటిని ఆదా చేసి శ్రీశైలం నుంచి రాయలసీమకు తరలించాం. భూమినే జలాశయంగా మార్చుకుని వినియోగించు కోవటం ద్వారా మెరుగైన నీటి నిర్వహణ చేపట్టవచ్చు. రబీ, ఖరీఫ్ పంటలు పూర్తి అయ్యాక కూడా ప్రస్తుతం మన రిజర్వాయర్లలో 65 శాతం నీటి నిల్వ ఉంది.
దేశంలోనే అతితక్కువ వర్షపాతం పడే అనంతపురం జిల్లా కూటమి ప్రభుత్వం చూపిన చొరవ కారణంగా ఎక్కువ పండ్ల తోటలతో సంపన్నమైన ప్రాంతంగా మారిందని అన్నారు. గత పాలకులు విద్యుత్ ఛార్జీలు పెంచారని, రూ.1.24 లక్షల కోట్ల మేర అప్పులు చేశారని అన్నారు. వచ్చాక గత ప్రభుత్వం పెంచిన కూటమి సుమారుగా రూ.4,400 కోట్ల భారాన్ని కూడా ప్రజలపై వేయకుండా ప్రభుత్వమే భరిస్తోందని తెలిపారు. అలాగే ముందుగా విద్యుత్ ఛార్జీల ట్రూ డౌన్ చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు.
పిచ్చి ముదిరి మావిగన్ మాటలు
గత పాలకులు రాష్ట్ర ప్రజలకు అడ్రస్ లేకుండా చేసారు, ఇప్పుడు మీ రాజధాని ఏదంటే అమరావతి అని గర్వంగా చెప్పే రోజు వచ్చిందని సీఎం ప్రకటించారు. ‘గతంలో మూడు ముక్కలాట ఆడారు. ఇక మనకు ఒక్కటే రాజధాని నగరం. పార్లమెంటులో 50 పార్టీలు ఉంటే అందులో వైసీపీ మినహా 49 పార్టీలు అమరావతికి మద్దతు పలికారు. ఒక్క దిక్కుమాలిన వైసీపీ మాత్రమే రాష్ట్రానికి ద్రోహం చేసింది. పిచ్చి ముదిరి మావిగన్ అంటూ కొత్తపేరు తీసుకొచ్చారు. అమరావతి అని పలకడానికి కూడా ఇష్టం లేని వ్యక్తులు మావిగన్ అంటున్నారు.
బాబాయిని చంపి నా చేతిలో కత్తి పెట్టిన వాళ్లు ఎలాంటి రాజకీయమైనా చేస్తారు. అమరావతి పనులు వేగంగా జరుగుతుంటే.. చూసి సహించలేక ఫ్రస్టేషన్‌తో అవినీతి జరిగిందని అంటున్నారు. 2047 నాటికి ఏపీని అగ్రస్థానంలోకి తీసుకెళ్లే బాధ్యత తీసుకున్నాం. దీనికి ప్రణాళికలు కూడా సిద్ధం చేశాం. ఉత్తరాంధ్ర నుంచి పశ్చిమ గోదావరి వరకూ విశాఖ, ప్రకాశం- నెల్లూరు వరకూ అమరావతి, తిరుపతి కేంద్రంగా రాయలసీమ ప్రాంతాలు అభివృద్ధి రీజియన్లుగా తయారవుతాయి’ అని ఆశాభావం వ్యక్తం చేశారు.
పెట్టుబడులు వస్తుంటే ఓర్చుకోలేకపోతున్నారు
గత పాలకులు రాష్ట్రంపై పగపట్టారని, రాష్ట్రానికి పెట్టుబడులు, యువతకు ఉద్యోగాలు వస్తుంటే ఓర్వలేకపోతున్నారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ప్రతీ జిల్లాను అభివృద్ధి చేస్తున్నాం. ఆడబిడ్డల జోలికి వస్తే వారికి అదే చివరి రోజు అవుతుంది. ప్రజల ఆస్తులను కాపాడే బాధ్యత ప్రభుత్వనిదే. దేవాలయాలపై దాడులు చేసి తిరిగి ఎదురు దాడి చేస్తున్నారు. తిరుమలలో శ్రీవారి ప్రసాదం నాణ్యతను దెబ్బతీశారు. కల్తీ నెయ్యితో ఘోర అపచారం చేశారు. రాష్ట్రంపై విద్వేషం చూపిస్తే వారికి సహకరిస్తే పౌరులందరికీ నష్టం కలుగుతుంది.
పెట్టుబడులు తీసుకువస్తుంటే వారిని బెదిరిస్తున్నారు. ఇలాంటి వారిని దూరం పెట్టాలి. కరెంటు, నీరు లాంటి దీర్ఘకాలిక సమస్యలను క్రమంగా పరిష్కరించుకుందాం. అందరికీ సమర్ధవంతమైన, జవాబుదారీ పాలన ఇవ్వాలన్నదే మా లక్ష్యం. రాష్ట్రమే నా కుటుంబం. అందరికీ న్యాయం చేసే బాధ్యత మాది. ఆర్థిక కష్టాలు సూపర్ సిక్స్ పథకాల ద్వారా చేయూత అందిస్తాం. ఆదాయం వస్తే.. ఆదాయం వస్తుంది అప్పుడే సంక్షేమం చేయగలం. సుపరిపాలనకు ప్రజలంతా సహకరించాలని’ చంద్రబాబు విజ్ఞప్తి చేస్తున్నాను.
ప్రజల ముందే ప్రచారం
అనంతపురం జిల్లా, తాడిపత్రి పర్యటన సందర్భంగా నియోజకవర్గ ప్రోగ్రెస్ రిపోర్ట్‌ను యాడికి జలధార సభలో ముఖ్యమంత్రి చదివి వినిపించారు. వివిధ శాఖల పనితీరును ప్రజల ముందు ప్రజెంట్ చేశారు. సరిగ్గా పనితీరు కనబరచని వివిధ శాఖలకు చెందిన అధికారులను వేదికపైకి పిలిపించి వివరణ అడిగారు. పనితీరును మెరుగుపర్చాలని అధికారులకు సూచించారు. అధికారులకు పూర్తిగా సహకరిస్తామని… అధికారులు, ఉద్యోగులు కూడా రాష్ట్రాభివృద్ధికి సహకరించాలని సూచించారు. భూవివాదాలనేవి లేకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులకు స్పష్టం చేశారు.
ట్రాక్టర్లలో ఇసుక తీసుకెళ్తున్నప్పుడు ఎవరైనా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారా..? అని ప్రజలనే నేరుగా సభలో సీఎం అడగ్గా… ఎవ్వరూ అడ్డుకోవడం లేదని ప్రజలు బదులిచ్చారు. దీనికి సీఎం సూచనూ…ఆదాయం తగ్గినా పర్వాలేదనడానికి ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. బాగా పని చేసిన అధికారాన్ని అభినందించి ప్రజలతోనే సభలో చప్పట్లు కొట్టారు. ఉద్యోగుల పనితీరు ఆధారంగా సూపర్ అచీవర్స్.. అచీవర్స్.. పెర్ఫార్మర్స్.. లెర్నర్స్ గా విభజిస్తున్నట్టు ముఖ్యమంత్రి. కొందరు అధికారులు గైర్హాజరు కావడంతో…ఇకపై తాను వచ్చే ప్రతీ సభకు జిల్లా అధికార యంత్రాంగం మొత్తం హాజరుకావాలని.
జై అంటూ అమరావతి నినాదాలు
ముఖ్యమంత్రి చంద్రబాబు జలధార కార్యక్రమంలో ప్రజావేదిక సభకు ముందు ప్రజలు జై అమరావతి అంటూ నినాదాలు చేశారు. రాజధాని అమరావతికి పార్లమెంట్ చట్టబద్దత కల్పించడంపై హర్షం వ్యక్తం చేశారు. స్వయంగా అమరావతి లోగో పట్టుకుని సభకు జేసీ ప్రభాకర్ రెడ్డి. యాడికిలో సీఎం హెలిక్యాప్టర్ దిగాక అమరావతి బ్యాడ్జిని అందించారు. సభలో రాజధానికి చట్టబద్దతపై హర్షం వ్యక్తం చేస్తూ ప్లకార్డులు, జెండాలు ప్రదర్శించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ…రాష్ట్రానికి ద్రోహం చేసిన పార్టీ వైసీపీ అని.
వైసీపీ ఓ దిక్కుమాలిన పార్టీ అంటూ ఘాటుగా స్పందించారు. రాష్ట్రం మీద పగ పట్టినట్టు వైసీపీ వ్యవహరించింది. ఫ్యాక్షనిస్టులు, ముఠా నాయకుల కంటే ఘోరంగా రాష్ట్రాభివృద్ధిని వైసీపీ అడ్డుకుంటుందని దుయ్యబట్టారు. సభ అనంతరం పార్లమెంటులో అమరావతికి చట్టబద్ధత ఆమోదానికి గుర్తుగా సీఎంకు అమరావతి జ్ఞాపికను జేసీ పవన్ రెడ్డి అందించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్, స్థానిక ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి, ఎంపీలు, జిల్లా ప్రజాప్రతినిధులు ఉన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు తన ప్రసంగానికి ముందు ప్రజావేదిక వద్ద ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. సంరక్షణకు అనంతపురం జిల్లా, నియోజకవర్గంలో నీటి చర్యలను జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి వివరించారు. 100 రోజుల యాక్షన్ ప్లాన్‌కు సంబంధించిన వివరాలను ఫోటో ఎగ్జిబిషనులో అధికారులు ప్రదర్శించారు. డ్వాక్రా, స్థానిక మహిళలు తయారు చేసిన ఉత్పత్తుల స్టాల్‌ను, గ్రానైట్, డొలమైట్, సున్నపురాయి గనులకు సంబంధించిన స్టాల్‌ను సందర్శించారు. హార్టికల్చర్ ఉత్పత్తులను కూడా సీఎం చంద్రబాబు పరిశీలించారు.

C.E.O
Cell – 9866017966
.webp)
