
హైదరాబాద్ పాతబస్తీలో ఘటన ఉద్రిక్తతకు దారి తీసింది. అక్రమ నిర్మాణాల కూల్చివేతల సందర్భంగా అధికారులతో ఘర్షణ చోటుచేసుకోవడంతో ఎంఐఎం ఎమ్మెల్సీతో పాటు కార్పొరేటర్‌పై చార్మినార్ పోలీసులు కేసు నమోదు చేశారు. నిన్న పాతబస్తీలో హుస్సేనాలెండో సమీపంలోని అధికారులు కూల్చివేతలు చేశారు. ఈ సమయంలో అక్కడికి చేరుకున్న ఎంఐఎం నాయకులు కూల్చివేతలను అడ్డుకుంటూ నానా హంగామా చేశారు… దీనితో విధుల్లో ఉన్న ఒక కానిస్టేబుల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
కూల్చివేతల సమయంలో అక్కడికి వచ్చిన మజ్లీస్ నాయకులు అధికారుల విధుల్లో ఆటంకం కలిగించడమే కాకుండా పోలీసులతో దురుసుగా ప్రవర్తించినట్లు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కేసుకు సంబం ధించి ఘాన్సీ బజార్‌కు చెందిన ఐఎంఐఎం ఇన్చార్జ్ సాహిల్ అక్బర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఈ ఘటనతో పాతబస్తీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కేసు విచారణ కొనసాగుతుందని పోలీసులు తెలిపారు.

C.E.O
Cell – 9866017966
.webp)
