
సినిమా తారలకు అభిమానులు ఉండటం సహజం. అందులోనే కొందరు వీరాభిమానులు కూడా ఉంటారు. తమ అభిమాన నటినటుల కోసం అప్పుడప్పుడు అత్యుత్సాహం కనిపిస్తుంది. ఈ విషయంలో ముఖ్యంగా హీరోయిన్లు కొంత మేరకు ఉంటారు.
ఇటీవలికాలంలో ఎంత పెద్ద స్టార్స్ అయినా అభిమానుýను కలుస్తున్నారు, ఫోటోలు దిగుతున్నారు. వారితో ఇంటరాక్ట్ కూడా అవుతున్నారు. ఒక్కోసారి శ్రుతి మించిన అభిమానం వల్ల స్టార్స్ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. గతంలో కూడా కొన్ని అనూహ్య సంఘటనలు జరగడం, హీరోయిన్లు షాక్‌కి గురవడం జరిగింది.
తాజాగా మలయాళ హీరోయిన్ మంజు వారియర్‌కు ఇలాంటి చేదు అనుభవం ఎదురైంది. రైస్ బౌల్ ఆఫ్ కేరళ పేరు తెచ్చుకున్న పాలక్కాడ్‌లో ఒక జ్యూయలరీ షాప్ ఓపెనింగ్‌కి మంజు వారియర్. ఆమె అక్కడికి వస్తున్నారన్న సమాచారంతో లెక్కకు మించిన అభిమానులు ఆ తర్వాత చేరుకున్నారు. వారిని అదుపు చేస్తున్నందున ఒక లేడీ అభిమాని మంజును హగ్ చేసుకొని లిప్ టు లిప్ కిస్ ఇచ్చింది. ఆమెను అక్కడి నుంచి పంపించేశారు వెంటనే సెక్యూరిటీ సిబ్బంది.
ఈ హఠాత్ సంఘటనతో మంజు వారియర్ షాక్ అయినప్పటికీ కాసేపటికి తేరుకొని ఓపెనింగ్ సెర్మనీని నిర్వహించారు. ఇటీవల మరో హీరోయిన్ హనీ రోజ్ విషయంలో కూడా ఇదే జరిగింది. ఒక అభిమాని ఆమె నడుము మీద చెయ్యి వేసే ప్రయత్నం చేశాడు. ఇలాంటి ఘటనలపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. అభిమానం హద్దులు దాటుతోందని, అది ఆరోగ్యకరం కాదని అంటున్నారు. సెలబ్రిటీలకు ఇలాంటి సందర్భాల్లో భద్రత కరువైందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.
?s=20

C.E.O
Cell – 9866017966
