
-నిన్న థియేటర్స్ లోకి ఉస్తాద్
-ఫస్ట్ డే పరిస్థితి ఏంటి
-సెకండ్ డే టాక్ ఎలా ఉంది
ఈ సారి పెర్ఫార్మెన్స్ బద్దలైపోయిద్ది అంటూ పవర్ స్టార్ ‘పవన్ కళ్యాణ్'(పవన్ కళ్యాణ్)నిన్న ‘ఉస్తాద్ భగత్ సింగ్'(ఉస్తాద్ భగత్ సింగ్)తో సెల్యులాయిడ్ పై ల్యాండ్ అయ్యాడు. అభిమానులు, మూవీ లవర్స్ అయితే థియేటర్స్ లోనే ఉగాది సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. అంతలా ఉదయం ఐదు గంటల షో నుంచే ఉస్తాద్ అభిమానుల సందడి థియేటర్స్ లో ప్రత్యక్షమైంది. ఇక తొలి రోజు టాక్ పరంగా చూస్తే హిట్,పర్వాలేదనే టాక్ వచ్చింది. మరి ఈ నేపథ్యంలో రెండవ రోజు టాక్ ఎలా వస్తుందనే ఆసక్తి అందరిలో ఉంది. మరి ఆ టాక్ ఎలా ఉందో చూద్దాం.
ఇప్పటికే కొన్ని థియేటర్లలో షోలు కంప్లీట్ అయ్యాయి. థియేటర్ నుంచి బయటకి వచ్చిన వాళ్లంతా ఉస్తాద్ బాగుంది. ఎక్కడ బోర్ కొట్టలేదు. పవన్ తో పాటు శ్రీలీల క్యారెక్టర్స్ హైలెట్ గా నిలిచాయి. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ కూడా బాగానే ఉన్నాయి. టోటల్ గా సినిమా బాగుందని అంటున్నారు. కొంత మంది దగ్గర నుంచి మాత్రం రెగ్యులర్ సినిమా అనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. కలెక్షన్స్ పరంగా చూసుకుంటే మొదటి 52 కోట్ల గ్రాస్ రాబట్టినట్లుగా ట్రేడ్ సర్కిల్స్ లో వార్తలు వినిపిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: రామ్ గోపాల్ వర్మ: ఆ ఇద్దరు పతనం కావాలి.. రామ్ గోపాల్ వర్మ షాకింగ్ కామెంట్స్
మరి ఈ నేపథ్యంలో రెండవ రోజు సాధించే కలెక్షన్స్ పై సినిమా ఫలితం ఉంటుందనే అభిప్రాయాన్ని కూడా వాళ్లంతా వ్యక్తం చేస్తున్నారు. 150 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కినట్లుగా చెప్తున్న ఉస్తాద్ లాంగ్ రన్ లో ఏ మేర కల్లెక్షన్స్ రాబడుతున్నాయి. నిర్మాతలని,డిస్ట్రిబ్యూటర్స్ ని లాభాల బాట పట్టిస్తుందా? అనే సినీ మాటలు సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్నాయి. దర్శకుడు హరీష్ శంకర్ తో పాటు మైత్రి మూవీ మేకర్స్ సినిమా విజయంతమైనదని చెప్పడం జరిగింది.

C.E.O
Cell – 9866017966

