
– పూజా హెగ్డే అందాల జాతర
– ట్రెండీ లుక్‌లో నెటిజన్ల మనసు దోచుకుంటున్న క్రేజీ బ్యూటీ.
– మళ్ళీ ఫామ్ లోకి వస్తున్న పూజ..
– తన గ్లామర్‌తో కుర్రకారుకు చెమటలు పట్టిస్తున్న వైనం.
టాలీవుడ్ బుట్టబొమ్మ పూజ హెగ్డే ఎక్కడపెట్టినా అక్కడ సందడి మామూలుగా ఉండదు. తనదైన స్టైల్ మరియు గ్లామర్‌తో తిప్పిన కెమెరా కళ్లను తనవైపుకు తీసుకోవడం పూజకు వెన్నతో పెట్టిన విద్య. తాజాగా ప్రముఖ ఓటీ ప్లాట్‌ఫామ్ ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’ నిర్వహించిన గ్రాండ్ ఈవెంట్లో పూజా హెగ్డే హాజరై అందరి దృష్టిని ఆకర్షించింది. తన గ్లామరస్ అప్పియరెన్స్‌తో ఈవెంట్‌కే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఈ మెగా ఈవెంట్ కోసం పూజ ఒక అద్భుతమైన లైట్ స్కై బ్లూ కలర్ డ్రెస్సును ఎంచుకుంది. ఈ ట్రెండీ అవుట్‌ఫిట్‌లో ఆమె మెరిసిపోతూ కెమెరాలకు ఫోజులిచ్చింది. పూజా స్టైలింగ్, ఆమె చిరునవ్వు సోషల్ మీడియాలో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారారు. ఆమె ఫ్యాషన్ సెన్స్ ఎప్పుడూ ఒక లెవల్లో ఉంటుందని ఈ ఫోటోలు చూస్తే మరోసారి స్పష్టమవుతోంది. నెటిజన్లు సైతం “పూజ మళ్ళీ తన పాత గ్లామర్‌తో ఫ్యాన్స్‌ను అలరిస్తోంది” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
సినిమాల విషయానికి వస్తే, ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో పూజా హెగ్డే ఉంది. ముఖ్యంగా ఈ ప్రైమ్ ఈవెంట్లో ఆమె నటించబోతున్న కొత్త చిత్రాలకు సంబంధించిన అప్డేట్లు కూడా వెలువడ్డాయి. అహన్ శెట్టి సరసన ‘సంకి’ అనే బాలీవుడ్ చిత్రంలో ఆమె నటిస్తోంది. ఈ చిత్రం థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో ఉండబోతోందని, ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుందని ఈ సందర్భంగా పూజా ధీమా వ్యక్తం చేసింది.
లేకపోతే ఈ ఈవెంట్‌కి హాజరవుతున్న సమయంలోనే అక్కడున్న అభిమానులు, కెమెరామెన్ ఈమెను ఫోటోలు తీసే ప్రయత్నం చేశారు.. ఆ ఒక అభిమాని మిమ్మల్ని కలవాలి అని అన్నాడు. దానికామె రండి అని పిలిచింది. అంతటితో ఆగకుండా మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని అన్నాడు. పెళ్లా అంటూ నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయింది పూజ. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
రెండవ పాటు సరైన సక్సెస్ లేక ఇబ్బంది పడిన పూజ, ఇప్పుడు మళ్ళీ తన సెకండ్ ఇన్నింగ్స్‌ను గ్రాండ్‌గా ప్లాన్ చేస్తోంది. తెలుగులో కూడా అగ్ర హీరోల సరసన నటించేందుకు చర్చలు జరుగుతున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్. కేవలం సినిమాలే కాకుండా, ఇలాంటి భారీ ఈవెంట్లలో తన గ్లామర్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తూ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను మరింత పెంచుకుంటోంది.
ప్రస్తుతం పూజ ఫోటోలు ఇంటర్నెట్లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఆమె తదుపరి సినిమాల కోసం అభిమానులు ఆసక్తిగా ఉన్నారు. రాబోయే రోజుల్లో తన స్ట్రాంగ్ కమ్ బ్యాక్‌తో బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుతుందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. వరుస ఫోటోషూట్లు, సినిమా అప్డేట్లతో పూజా హెగ్డే మళ్ళీ టాలీవుడ్ మరియు బాలీవుడ్ మీడియాలో సంచలనంగా నిలుస్తోంది.
