
మ్యూజిక్ డైరెక్టర్‌గా, యాక్టర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న జి.వి. ప్రకాష్ కుమార్, శ్రీగౌరి ప్రియ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘హ్యాపీ రాజ్'(హ్యాపీ రాజ్). తాజాగా విడుదలైన ఈ మూవీ ట్రైలర్ ఆద్యంతం వినోదాత్మకంగా సాగుతూ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తోంది. ముఖ్యంగా ఒకప్పటి లవర్ బాయ్ అబ్బాస్ ఈ సినిమాతో మళ్ళీ వెండితెరపై మెరవడం ప్రేక్షకులకు పెద్ద సర్ప్రైజ్ అని చెప్పాలి. (హ్యాపీ రాజ్ ట్రైలర్)
ట్రైలర్ చూస్తుంటే ఇదొక యూత్ ఫుల్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని అర్థమవుతోంది. ట్రైలర్ ప్రారంభం నుంచే చాలా ఎనర్జిటిక్‌గా ఉంది. హీరో రాజ్ (జి.వి. ప్రకాష్) తన ప్రేమను గెలిపించుకోవడానికి పడే పాట్లు, ఆ వచ్చే కామెడీ సీన్లు నవ్వులు పూయిస్తున్నాయి. ముఖ్యంగా హీరో ఫ్యామిలీ, హీరోయిన్ ఫ్యామిలీ మధ్య జరిగే డ్రామా, కన్ఫ్యూజన్ కామెడీ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.
ట్రైలర్లో సంగీత దర్శకుడు జస్టిన్ ప్రభాకరన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలైట్‌గా నిలిచింది. సీన్ల మూడ్‌ను బట్టి ఆయన ఇచ్చిన మ్యూజిక్ చాలా ఫ్రెష్‌గా ఉంది. విజువల్స్ కూడా చాలా కలర్ఫుల్గా, రిచ్‌గా ఉన్నాయి.
కేవలం కామెడీ మాత్రమే కాకుండా, కథలో బలమైన ఎమోషనల్ పాయింట్ కూడా ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతోంది. ఇది ఒక అబ్బాయి పెళ్లి చుట్టూ తిరిగే కథ. ప్రేమించిన అమ్మాయి తండ్రిని (అబ్బాస్) ఒప్పించడానికి హీరో చేసే ఫీట్లు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. అలాగే తండ్రి కొడుకుల ట్రాక్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంది.
మొత్తానికి ‘హ్యాపీ రాజ్’ ట్రైలర్ ఒక మంచి ఎంటర్టైనర్ అనే భరోసా ఇస్తోంది. జి.వి. ప్రకాష్ మార్కు నేచురల్ యాక్టింగ్, శ్రీగౌరి ప్రియ క్యూట్‌నెస్ ఆకట్టుకున్నాయి. ఇక అబ్బాస్ స్క్రీన్ ప్రెజెన్స్ వింటేజ్ ఫీల్‌ను ఇస్తోంది. సోషల్ మీడియాలో ఈ ట్రైలర్‌కు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే, బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా మంచి విజయాన్ని అందుకునేలా కనిపించింది.
మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ తెలుగులో ఈ సినిమా విడుదల చేస్తే అద్భుతమైన ప్రమోషన్స్ కూడా జోరుగా సాగుతున్నాయి. మార్చి 27న విడుదల కానున్న ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్లో మ్యాజిక్ చేస్తుందో చూడాలి.
ఇది కూడా చదవండి: ఓటీటీలో వణుకు పుట్టిస్తున్న ‘ఫోర్ట్ ఫ్లోర్’.. ఆ నాలుగో అంతస్తులో ఏం జరిగింది?

C.E.O
Cell – 9866017966

