
మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు హరీష్ రావు మంత్రి పొంగులేటిని ఎందుకు టార్గెట్ చేశారు. ఇటీవల అసెంబ్లీలో రాఘవ కన్ స్ట్రక్టన్స్ వ్యవహారం.. తాజాగా నాదర్ గుల్‌లో 7 వేల కోట్ల భూ కుంభకోణం అంటూ గుప్పిస్తున్న ఆరోపణలు. ఇంతకీ ఈ కొత్త కుంభకోణం వివరాలేంటి? అని చూస్తే..
హరీష్ ఏం చేసినా ఒక పక్కా స్కెచ్ ప్రకారమే చేస్తారు. ఎందుకంటే ఆయన మైండ్ సెట్ అలాంటిది. మందుల సామెల్ అనే కాంగ్రెస్ ఎమ్మెల్యే అన్న.. ఒక పక్క కేటీఆర్ ని క్రాస్ చేసి పార్టీ ఆక్రమణ ఎలా చేద్దామని ఎలా ట్రై చేస్తున్నారో.. ఇప్పుడు ప్రత్యేక పార్టీలని కూడా అలాగే లక్ష్యంగా చేసుకున్నారన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది.
పొంగులేటి ప్రస్తుతం మంత్రిగా మైనింగ్ శాఖ, గతంలో కేటీఆర్ నిర్వహించగా.. ఆ సమయంలో ఎన్ని అక్రమాలు జరిగాయో.. ఎన్ని అరాచకాలు నడిచాయో.. గత అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చడివి వినిపించిన సంగతి తెలిసిందే. వీటిపై సీబీఐఐడీ ఎంక్వయిరీ కూడా వేస్తామని సీఎం ప్రకటించిన సంగతీ విదితమే. ఈ అక్రమాల్లో తన సోదరుడి ప్రమేయం కూడా ఉండడంతో.. ఉలిక్కి పడ్డ హరీష్ రావు, ఈ శాఖామాత్యుడైన పొంగులేటిని తన టార్గెట్ గా ఫిక్స్ చేసినట్టు సమాచారం.
సీఎం రేవంత్ ప్రకటన బట్టి చూస్తే ఇదేదో తనకు, తన కుటుంబానికి గట్టిగానే తగిలేలా ఉందని భావించిన హరీష్. పొంగులేటి చుట్టూ ఉన్న వ్యవహారాలపై దృష్టిసారించినట్టు కనిపిస్తోంది. అందుకే ఆయన నాదర్ గుల్ కుంభకోణాన్ని తెరపైకి తెచ్చినట్టు చూపుతున్నారు. రంగారెడ్డి జిల్లా, సరోర్‌నగర్ మండలం, నాదర్‌గుల్ పరిధిలోని సర్వే నంబర్ 613లో 373 ఎకరాల ప్రభుత్వ భూమి. సుమారు 7 వేల కోట్ల రూపాయల విలువైన ఈ ప్రభుత్వ భూమిని మంత్రి పొంగులేటి కుటుంబ సభ్యులకు చెందిన కంపెనీలు.
గతంలో వైఎస్సార్ హయాంలో ఈ భూమిని ప్రభుత్వ భూమిగా ప్రకటించి టీజీఐఐసీకి అప్పగించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో ఇది 22A నిషేధిత జాబితాలో ఉండేదీ భూమి. అయితే, ఇప్పుడు అధికార బలాన్ని ఉపయోగిస్తున్నారు.. రైతులను భయపెట్టి, ఫెన్సింగ్ వేసి ఈ భూమిని కబ్జా కోసం హరీష్ రావు ఆరోపిస్తున్నారు. 600 మంది పేద రైతులు ఈ భూమి వల్ల నష్టపోతున్నారని అంటున్నారు హరీష్.
బేసిగ్గా ఏదైనా గీతను చిన్న గీతగా చూపించాలంటే, దాని పక్కనే పెద్ద గీత గీస్తే సరిపోతుందంటారు. హరీష్ సరిగ్గా అదే ఫార్ములా ఉపయోగిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తమ హయాంలో జరిగిన మైనింగ్ అక్రమాల ముందు ఇవి చాలా పెద్దవి కాబట్టి.. ఇవేవీ సీఎంకి కనిపించవా? హైడ్రాకు కనిపించవా? అంటూ ఆరోపిస్తున్నారు.
కాగా హరీష్ ఆరోపణ’కు కాంగ్రెస్ కౌంటర్ ఇస్తోంది. హరీష్ రావు ఆరోపణలన్నీ రాజకీయ ప్రేరేపితలే అంటోంది. బీఆర్ఎస్ హయాంలోనే ఈ స్థలంలో కోహినూర్ కంపెనీ రేకుల షెడ్డు వేసిందని కాంగ్రెస్ చెబుతోంది. జరిగిన తప్పంతా వారి హయాంలో జరగ్గా వాటిని పట్టుకుని ఇప్పుడు కాంగ్రెస్‌పై ఆరోపణలు గుప్పిస్తున్నారని విమర్శిస్తున్నారు.
ఇక రాఘవ కన్‌స్ట్రక్షన్స్ వివాదం విషయానికి వస్తే.. మార్చి చివరి వారంలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో హరీష్ రావు ఈ రోజు లేవనెత్తారు మంత్రి పొంగులేటికి చెందినదిగా చెప్పబడే రాఘవ కన్‌స్ట్రక్షన్స్ కంపెనీ, ఎలాంటి అనుమతులు లేకుండా స్టోన్ క్రషింగ్, మైన్ చేస్తున్నది ఆయన ఆరోపణ. ముఖ్యంగా జీవో 111 నిబంధనలకు విరుద్ధంగా కార్యకలాపాలు సాగిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడ ప్రదర్శన. కంపెనీ ప్రభుత్వం సూచించూ, ఇప్పటికే ఆ కంపెనీకి నోటీసులు ఇచ్చి 2.7 కోట్ల రూపాయల జరిమానా వసూలు చేశామని. అయితే పొంగులేటి పేరును రికార్డుల నుంచి తొలగించాలని స్పీకర్ డిమాండ్ చేయడం గొడవకు దారితీసింది.
ఇంతకీ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డిని హరీష్ టార్గెట్ చేయడానికి కారణం.. ఆయన ప్రస్తుతం ప్రస్తుతం, మైనింగ్ శాఖల మంత్రి. భూములు, గనులు ఆయన పరిధిలోనే ఉంటాయి కాబట్టి, భూ దాడులు, అక్రమ మైనింగ్ ఆరోపణలు నేరుగా ఈయనపైనే ప్రభావం చూపుతాయి. పొంగులేటి గతంలో బీఆర్ఎస్‌లో ఉండి, తర్వాత కాంగ్రెస్‌లోకి వెళ్లారు. ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్‌ను దెబ్బతీయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు బీఆర్ఎస్ ఆయన్ని ఇరుకున పెట్టడం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని చూస్తోంది.
ఇక చెరువుల ఆక్రమణల పేరుతో హైడ్రా ద్వారా ప్రభుత్వం బీఆర్ఎస్ నేతల కట్టడాలను కూల్చివేస్తోంది. దీనికి ప్రతిగా, మంత్రి కుటుంబమే భూ కబ్జాలకు చూస్తున్నప్పుడు హైడ్రా ఎందుకు మౌనంగా ఉంది? అని ప్రశ్నించడం ద్వారా హరీష్ రావు ప్రభుత్వాన్ని డిఫెన్స్‌లో పడేశారు. మొత్తానికి, ఈ 7 వేల కోట్ల భూ కుంభకోణం ఆరోపణలతో తెలంగాణ రాజకీయం మరోసారి వేడెక్కింది. న్యాయ విచారణ జరిపించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది.

C.E.O
Cell – 9866017966

