Home Latest News ఆర్టీసీ నీ బలోపేతం చేయండి – షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్*    

ఆర్టీసీ నీ బలోపేతం చేయండి – షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్*    

by Jananethram News
0 comments

జననేత్రంన్యూస్.తెలంగాణస్టేట్.బ్యూరో.జూన్27*//:తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీ ఆర్టిసి) పని తీరుపై సమీక్ష సమావేశంనిర్వహించిన ఎమ్మెల్యేశాసనసభ కమిటీ హాల్ లో  ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ చైర్మన్,షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్  రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ పనితీరుపై సమీక్ష సమావేశం ను నిర్వహించారు. ఈ సమావేశంలో కమిటీ సభ్యులైన నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి,జుక్కల్ ఎమ్మెల్యే శ్రీ లక్ష్మీ కాంతారావు, రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, ఎమ్మెల్సీ తాత మధు మరియు శాసనసభ కార్యదర్శి డాక్టర్ నరసింహాచార్యులు ఇతర ఆర్టిసి సిబ్బంది తోపాటు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనార్, తెలంగాణా రాష్ట్ర  పబ్లిక్ సర్ప్రైజెస్ స్పెషల్ సెక్రెటరీ ఉదయ్ కుమార్, ఆర్టిసి సిబ్బందితోపాటు తెలంగాణ ఆడిట్ జనరల్  మాధవి  పాల్గొన్నారు. ఈ సమావేశంలో తెలంగాణా రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థలో జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. ఈ సందర్భంగా చైర్మన్ వీర్లపల్లి శంకర్  మాట్లాడుతూ…రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తరువాత మహాలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టి రాష్ట్రంలో ఉన్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందిస్తున్నాము. ఈ పథకం అమలు కోసం 2023- 24 లో 1045 కోట్లు, 2024- 25 లో 3616 విడుదల చేశామని తెలిపారు. ఆర్టీసీని మరింత బలోపేతం చేసి మెరుగైన సేవలు అందించాలని ఆర్టీసీ సిబ్బందిని కోరారు.2014- 2023 సంవత్సరాలకు సంబంధించిన 5 ఆడిట్ పారాలను కమిటీ సమీక్షించింది. ఆర్టిసి సొంత స్థలాలను పరిరక్షించుకోవాల్సిన భాధ్యత ఆర్టీసీ ఉన్నత అధికారులు చొరవ చూపాలని కోరారు. అలాగే ఆర్టీసీ సముదాయాలు,షాపింగ్ కాంప్లెక్స్ లు, ఖాళీ స్థలాలను లీజుకు ఇస్తే గడువు ముగిసే లోపు టెండర్ లను పిలిచి ఆర్టిసి ఆదాయాన్ని పెంచాలని సిబ్బందిని కోరారు.

You may also like

Leave a Comment

Jananethram News delivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, Swendaily.com is your trusted source for timely and reliable news

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird