
కృష్ణా జిల్లా చల్లపల్లి పోలీస్ స్టేషన్ మంగళవారం (మార్చి 31) ఉదయం భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఓసైతో పాటు మరో ముగ్గురు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. వివరాలిలా ఉన్నాయి. అక్రమంగా నిలవ ఉంచిన మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకుని పోలీసు స్టేషన్‌కు తీసుకొచ్చిన సమయంలో ఈ పేలుడు సంభవించింది.
పేలుడు తీవ్రతకు స్టేషన్ భవనం పాక్షికంగా దెబ్బతింది. స్టేషన్ ఆవరణలో నిలిపి ఉంచిన కొన్ని వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి. ఈ పేలుడులో గాయపడిన పోలీసులు హుటాహుటిన ఆసుపత్రికి చికిత్స పొందుతున్నారు. చల్లపల్లి సీఐ కేఎస్ రావు ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలపై ఆరా తీస్తున్నారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తుకు దర్యాప్తు. కాగా పేలుడు శబ్దానికి ఆ పరిసర ప్రాంతాల ప్రజలు భయపడుతున్నారు.

C.E.O
Cell – 9866017966

