
డ్రగ్స్ వినియోగంపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో హైదరాబాద్‌లోని ప్రముఖ తారామతి బారాదరి రిసార్ట్‌లో పార్టీపై ఈగిల్ ఫోర్స్ ఆకస్మిక దాడి నిర్వహించామని ఈగిల్ టీం అధికారులు చర్యలు చేపట్టారు. ఈ దాడిలో ముంబైకి చెందిన నటుడు సహా ఆరుగురు వ్యక్తులను అరెస్టు చేశామని తెలి పారు.నిన్న అర్ధరాత్రి సమయంలో హైదరాబాద్‌లోని తారామతి బారాదరి రిసార్ట్‌లో ప్రత్యేక పార్టీపై ఈగిల్ ఫోర్స్ బృందం సోదాలు నిర్వహించామని “మోర్ కంటే ఫ్రెండ్స్” పేరుతో ఒక ప్రైవేట్ సంస్థ ఈ పార్టీని నిర్వహిస్తున్నట్లు ఈగిల్ టీం అధికారులు తెలిపారు.
డ్రగ్స్ తీసుకుని హాజరైనట్లు గుర్తించిన వారిలో ముంబైకి చెందిన నటుడు& మోడల్ సర్వర్ ప్రధానంగా ఉన్నాడు. అతడితో పాటు ప్రముఖ డీజే జాన్సన్‌తో పాటు వ్యాపారులు కూడా ఉన్నారు.. ఈ పార్టీకి ప్రముఖ ముంబై మరియు టాలీవుడ్ సినీ వర్గాలకు చెందిన ప్రముఖులు. ఈ పార్టీలో 35 మందికి డ్రగ్స్‌పై అనుమానం కలిగింది… అందులో ఆరుగురికి డ్రగ్స్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.దీంతో నటుడు సర్వర్, స్పైసెస్ వ్యాపారి నీహార్, వ్యాపారవేత్త నీహర్ భార్య ఆశి, డీజే జాన్సన్, వ్యాపారవేత్త యోగేశ్వర్, ఫార్మాస్యూటికల్ అనలిస్ట్ అవినాష్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. డ్రగ్స్ వినియోగంపై మరింత సమాచారం సేకరిస్తున్నామని… హైదరాబాద్‌లో డ్రగ్స్‌పై ప్రత్యేక నిఘా ఉంటుందని అధికారులు హెచ్చరించారు.

C.E.O
Cell – 9866017966

