
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాడిపత్రి నియోజకవర్గంలోని యాడికి సమీపంలో ఉన్న పెండేకల్ రిజర్వాయర్ వద్ద క్షేత్రస్థాయిలో రైతులతో నేరుగా మాట్లాడారు. ఈ సందర్భంగా స్థానిక రైతులు, వ్యవసాయ కూలీలతో ముఖి నిర్వహించి, బిందు సేద్యం, ప్రకృతి వ్యవసాయం, పీఎండీఎస్, ఉపాధి హామీ వంటి పలు వివరాలను తెలుసుకున్నారు.
రిజర్వాయర్ పరిధిలో సాగునీటి అవసరాలు, రైతులు సాగు చేస్తున్న సాగు విధానాలపై నీలంరెడ్డి, లక్కు శ్యామలతో సీఎం చర్చించారు. బిందు సేద్యం (డ్రిప్ ఇరిగేషన్) ద్వారా కలుగుతున్న ప్రయోజనాల గురించి పరిమి చరణ్ కుమార్, పాపసాని ముని యుగంధర్ వివరించారు. డ్రిప్ ఇరిగేషన్ పరికరాలను ప్రభుత్వం 90 శాతం సబ్సిడీపై అందించినట్లు వారు సీఎంకు తెలిపారు.
‘ప్రీమాన్ సూన్ డ్రై సోయింగ్’ విధానం సాగు చేయడం వల్ల పెట్టుబడి ఖర్చుల ద్వారా తగ్గుతున్నాయని రైతులు హరికృష్ణ, దేవి వివరించారు. అలాగే, అర్ధచంద్రాకార గుంతల విధానం ద్వారా నేల సారవంతం పెరిగి, మంచి దిగుబడులు వస్తున్నాయని మహిళా రైతులు నందిని, ప్రమీలమ్మ తెలిపారు. ప్రభుత్వ పథకాల అమలు తీరు, ఆధునిక సాగు శిక్షణ ప్రభావంపై సీఎం ఆరా తీశారు. రైతుల అభిప్రాయాలను తెలుసుకుంటూ, వ్యవసాయంలో సాంకేతికత వినియోగాన్ని మరింత విస్తరించాలని సూచించారు.

C.E.O
Cell – 9866017966


.webp)
