
తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుకు మరో మూడు నెలల పదవీకాలం పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ రాష్ట్ర ప్రభుత్వానికి అధికారిక సమాచారం అందించింది. ఈ పొడిగింపుతో పరిపాలనలో కొనసాగింపు ఉండనుంది. రాష్ట్ర ప్రభుత్వ పాలసీలో ఈ ప్రాధాన్యత సంతరించుకుంది.
వాస్తవానికి, ఆగస్టు 31న రామకృష్ణారావు పదవీ విరమణ చేయవలసి ఉండగా, ఆయన సేవలను కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం డీవోపీటీని కోరింది. ఇప్పటికే స్పందించిన కేంద్రం ఆయనకు ఏడు నెలల పొడిగింపు ఇచ్చింది.క్షేత్ర స్థాయిలో ప్రభుత్వ కార్యక్రమాల అమలులో రామరావుకృష్ణ కీలక పాత్ర పోషించారు.
యంత్రాంగాన్ని గాడిలో పెట్టడం, సీనియర్ ఐఏఎస్ అధికారులతో సమన్వయం కల్పించడం, గత ప్రభుత్వ రుణాల షెడ్యూలులో కూడా ఆయన కీలకంగా వ్యవహరించారు.ఇక మార్చి 31 నుంచి ప్రస్తుత పొడిగింపు గడువు ముగియనున్న నేపథ్యంలో, మరోసారి ఎక్స్‌టెన్షన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం డీవోపీటీకి లేఖ రాయగా, కేంద్రం సానుకూలంగా స్పందించింది. దీంతో రామకృష్ణారావు మరో మూడు నెలల పాటు ఎస్‌ఎస్ పదవిలో కొనసాగనున్నారు.

C.E.O
Cell – 9866017966

