
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్న తరుణంలో ఈ నిర్మాణ పనుల్లో అత్యంత కీలకమైన క్యాపిటన్ రీజియన్ డెవలెప్ మెంట్ అథారిటీ (సీఆర్‌డీఏ) కమిషనర్ బదిలీ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటివరకు సీఆర్ డీఏ కమిషనర్‌గా బాధ్యతలు నిర్వహించిన కన్నబాబును ప్రభుత్వం అకస్మాత్తుగా బదిలీ చేసింది. ఈ బదలీ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఓ వైపు అమరావతి నిర్మాణ పనులను ప్రారంభించేందుకు ప్రభుత్వం రాజధాని తరుణంలో సీఆర్డీయే కమిషనర్ బదిలీకి సంబంధించిన చర్చ జోరందుకుంది.
కాగా సీఎం చంద్రబాబు, మునిసిపల్ మంత్రి నారాయణలతో ఇటీవలి కాలంగా సీఆర్డీయే కమిషనర్ కన్నబాబుకు ఏర్పడిన సమన్వయ లోపమే ఈ బదిలీకి కారణమని విశ్వసనీయంగా తెలుస్తోంది. మంత్రి నారాయణ అమరావతి ప్రాజెక్టుల విషయంలో పకడ్బందీగా వ్యవహరిస్తున్నారు, పనులు వేగంగా జరగాలని అధికారులపై ఒత్తిడి పెంచుతున్నారు.
అయితే, ఈ కారణంగా తనకు ప్రాధాన్యత తగ్గడంపై కినుక వహించి అసంతృప్తికి లోనైన కన్నబాబు పనుల పురోగతికి అడ్డంకులు సృష్టిస్తున్నారన్న చర్చ గత కొంత కాలంగా జరిగింది. మరీ ముఖ్యంగా ఇటీవల సీఆర్డీఏ పరిధిలోని కొన్ని అధికారాలను ఇతర విభాగాలకు బదిలీ చేయడాన్ని కన్నబాబు తీవ్రంగా వ్యతిరేకించినట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే కన్నబాబును సీఆర్డీఏ కమిషనర్ బాధ్యతల నుంచి ప్రభుత్వం తప్పించిందని అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజధానిని ప్రపంచ స్థాయిలోనే ఉత్తమంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో చంద్రబాబు ఉన్నారు. ఈ ప్రణాళికనే అమరావతిలో భారీ ప్రాజెక్టులను ప్రభుత్వం చేపట్టింది. అయితే ఈ ప్రాజెక్టులు సజావుగా వేగంగా సాగి, నిర్దిష్ట గడువులో అమరావతి నిర్మాణం పూర్తి కావాలంటే ప్రభుత్వం, అధికారుల మధ్య సమన్వయం అత్యవసరం. కన్నబాబు నుంచి అటువంటి సమన్వయం కొరవడిందన్న ఆరోపణలు ఇటీవల కాలంలో వెల్లువెత్తుతున్నాయి. కన్నబాబు పని తీరు పట్ల మంత్రి నారాయణ ఒకింత అసంతృప్తితో ఇటీవలి కాలంలో వార్తలు వినవస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కన్నబాబును సీడీయే బాధ్యతల నుంచి ప్రభుత్వం తప్పించిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కన్నబాబు స్థానంలో సీనియర్ ఐఏఎస్ అధికారి సీఆర్డీయే కొత్త కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించారు.

C.E.O
Cell – 9866017966

