
ఇటీవలికాలంలో థియేటర్లలో కంటే ఓటీటీలోనే సినిమాలు చూసి ఎంజాయ్ ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే కొన్ని ఓటీటీ ప్లాట్ ఫామ్స్ ఆడియన్స్ అభిరుచిని గమనించి వారి మనసులకు దగ్గరగా ఉండే సినిమాలను తీసుకొస్తున్నాయి. దేశీయ చిత్రాలనే కాకుండా వివిధ దేశాల్లో సూపర్‌హిట్ అయిన సినిమాలను ఓటీటీ ద్వారా అందరికీ అందుబాటులోకి తెస్తున్నారు.
అందులో భాగంగానే ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో సరికొత్త ప్రేమకథ స్ట్రీమింగ్ అవుతోంది. దక్షిణ ఆఫ్రికా, నైజీరియా సంస్కృతుల నేపథ్యంలో తెరకెక్కిన ‘సాఫ్ట్ లవ్’ ఇప్పుడు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. మనసును తాకే అందమైన కథతో అందరూ మెచ్చే విధంగా తెరకెక్కించారు.
కథ విషయానికి వస్తే.. జెండీ జేలే అనే ఒక రిలేషన్షిప్ ఎక్స్పర్ట్, తన పెళ్లి రోజే తన కాబోయే భర్త చేతిలో మోసపోతుంది. ఆ అవమానంతో ప్రేమ మీద నమ్మకం కోల్పోయిన ఆమెకు, అనుకోకుండా ఎడ్వర్డ్ అనే ఫోటోగ్రాఫర్ పరిచయమవుతాడు. జీవితంలో ఎదురైన చేదు జ్ఞాపకాలను మర్చిపోయి, ఈ ఇద్దరూ మళ్ళీ ప్రేమలో ఎలా పడ్డారు? వారి ప్రయాణంలో ఎదురైన అడ్డంకులేంటి? అనే అంశాలు దర్శకుడు హోమ్స్ అవ ఎంతో మనోహరంగా చూపించారు.
నైజీరియా మరియు సౌత్ ఆఫ్రికాకు చెందిన నటినటుల కలయికలో వచ్చిన ఈ చిత్రం, ఆయా ప్రాంతాల జీవనశైలిని మరియు విభిన్న సంస్కృతులను అందంగా ఆవిష్కరించింది. కేవలం ప్రేమ, స్నేహం, నమ్మకం మరియు వ్యక్తిగత ఎదుగుదల వంటి అంశాలు మాత్రమే కాకుండా ఇందులో కూడా చర్చించారు. గతంలో వచ్చిన పలు రొమాంటిక్ చిత్రాల తరహాలోనే ఇది కూడా ఒక ‘ఫీల్ గుడ్’ మూవీగా గుర్తింపు పొందుతోంది.

C.E.O
Cell – 9866017966
