
-అల్లు అర్జున్ చిత్రాల కొత్త కబురు ఏంటి
-అట్లీ మూవీ ఎక్కడ దాకా వచ్చింది
-లోకేష్ కనగరాజ్ మూవీ అప్ డేట్ ఏంటి!
-అభిమానులు ఏం కోరుతున్నారు
హీరోలపై ఫ్యాన్స్ కి ఉండే అభిమానం చూస్తే మన రెండు కళ్ళు సరిపోవు. అంతలా తమ అభిమాన హీరోని ఆరాధిస్తారు. అలాంటి అభిమానులని పొందటం హీరోలకి ఆ దేవుడు ఇచ్చిన వరంగా కూడా భావించవచ్చు. అలాంటి హీరోల్లో పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(అల్లు అర్జున్)కూడా ఒకరు. ప్రెజెంట్ అట్లీతో చేస్తున్న మూవీతో ఉన్నాడు. మరో క్రేజీ కాంబో లోకేష్ కనగరాజ్ మూవీ కూడా అనౌన్స్ చేసాడు. దీంతో సోషల్ మీడియా వేదికగా గత కొన్ని రోజుల నుంచి అభిమానులు స్పందిస్తూ ‘సదరు చిత్రాల అప్ డేట్స్ ఇస్తూ ఉండవచ్చు కదా! అట్లీ మూవీ నుంచి పిక్స్ రిలీజ్ చేయవచ్చు కదా! అని అడుగుతున్నారు. మేకర్స్ నుంచి స్పందన లేకపోయేసరికి ఆ అందరు సినీ అలకతో ఉన్నారు. అలాంటి వారందరి కోసం మా తెలుగు వన్ ఛానల్ ఎక్స్ క్లూజివ్ గా ఇస్తుంది. మరి ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం.
అల్లు అర్జున్ పుట్టిన రోజు ఏప్రిల్ 8 .. ఆ రోజున అట్లీ(Atlee Kumar)మూవీ నుంచి లుక్ రిలీజ్. దాంతో పాటు టైటిల్, రిలీజ్ డేట్ ఇతర తారాగణాన్ని ప్రకటించే అవకాశం కూడా ఉన్నట్లు టాక్ . ఆల్ రెడీ అందుకు సంబంధించిన పనులు కూడా జరుగుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇక ఇదే రోజు లోకేష్ కనగరాజ్(లోకేష్ కనగరాజ్)మూవీ షూట్ కూడా మొదలుకానుందని సమాచారం. ఈ రెండు సినిమా విశేషాలే కాదు, అల్లు అర్జున్ లైనప్ లో ఉన్న మరిన్ని సినిమాల లిస్ట్ కూడా వెల్లడి చేసే అవకాశం ఉంది. దీంతో అల్లు అర్జున్ బర్త్ డేన అభిమానుల జోష్ మరింత రెట్టింపు అవ్వడం ఖాయం.
కూడా చదవండి: ఉస్తాద్ భగత్ సింగ్: 2వ డే కలెక్షన్స్ ఇవేనా!.. హిట్టా! ప్లాపా!
ఇప్పుడు తెలుగు వన్(తెలుగు వన్)సైట్ లో వస్తున్న ఈ న్యూస్ తో అల్లు అర్జున్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా తెలుగు వన్ కి థాంక్స్ చెప్తున్నారు. ఈ లైనప్ తో రాబోయే రోజుల్లో అల్లు అర్జున్ పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ ని చెడుగుడు ఆడుకోవడం ఖాయం.

