
-థియేటర్స్ లో సందడి చేస్తున్న ఉస్తాద్
-సినిమా ఎలా ఉంది
-చిరు రాకతో అదనపు ఆకర్షణ
పవర్ స్టార్ ‘పవన్ కళ్యాణ్'(పవన్ కళ్యాణ్)పవర్ ప్యాక్డ్ మూవీ ‘ఉస్తాద్ భగత్ సింగ్'(ఉస్తాద్ భగత్ సింగ్)థియేటర్స్ లో తన హవా కొనసాగిస్తోంది. ఫ్యామిలీస్ కూడా ఉస్తాద్ బాట పడుతుండంతో పాటు మూవీ చూసాక వాళ్ళందరు మీడియాతో మాట్లాడుతు ‘ఈ మధ్య కాలంలో ఎలాంటి అసభ్యత లేకుండా వచ్చిన మూవీ ఉస్తాద్. పలానా సీన్స్ మాకు బాగా నచ్చాయని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఆ ఉస్తాద్ ఫ్యామిలీలో మెగాస్టార్ చిరంజీవి(చిరంజీవి)దంపతులు కూడా జాయిన్ అయ్యారు.
రీసెంట్ గా హైదరాబాద్ లో చిరంజీవి, సురేఖ దంపతులు, పవన్ దంపతులు కలిసి ఉస్తాద్ భగత్ సింగ్ ని వీక్షించారు. ముఖ్యంగా గ్యాంగ్ లీడర్ లోని ‘వాన వాన వెల్లువాయే’ సాంగ్ కి పవన్ డాన్స్ చేస్తున్న సీన్ తో పాటు తొలిప్రేమలోని ‘ఈ మనసే, నా మనసే’ సాంగ్ కి చిరంజీవి ఫుల్ ఎంజాయ్ చేశాడు. ఈ స్పెషల్ షోలో హరీష్ శంకర్, శ్రీలీల, అనిల్ రావిపూడి, ఆనంద్ సాయి, మైత్రి మూవీ మేకర్స్ అధినేతలతో పాటు మరికొంత మంది శ్రేయోభిలాషులు ఉన్నారు. మైత్రి మూవీస్ నే ఎక్స్ వేదికగా ఆ మొత్తం వీడియోని షేర్ చేసింది.
ఇది కూడా చదవండి: Ntr vs chiranjeevi: ఎన్టీఆర్ పై చిరంజీవి ట్వీట్.. ఇది రేంజ్ అంటే
ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో మెగా అభిమానుల కామెంట్స్ తో మైత్రి ఎక్స్ సర్వర్ క్రాక్ అయ్యే పరిస్థితి. పవన్ ప్రీవియస్ చిత్రం ‘ఓజి’ ని కూడా చిరంజీవి, సురేఖ గారు చూసిన విషయం తెలిసిందే.
?s=20

C.E.O
Cell – 9866017966

