
.webp)
తెలుగు తేజం, భారత స్టార్ షట్లర్, రెండు సార్లు ఒలింపిక్ మెడల్ విజేత పీవీ సింధు దుబాయ్ ఎయిర్ పోర్టులో చిక్కుకుపోయింది. ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనేందుకు బర్మింగ్‌హామ్ వెళుతున్న సింధు దుబాయ్ విమానాశ్రయంలో చిక్కుకుపోయింది. పశ్చిమాసియాలో యుద్ధవాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. జ్రాయెల్-అమెరికా దాడులకు ప్రతీకగా ఇరాన్ ప్రతిదాడులకు ప్రేరేపిస్తోంది.ఇరాన్ దాడులు అమెరికా సైనికులకు ఆశ్రయం కల్పిస్తున్న నగరాలు లక్ష్యంగా సాగుతున్నాయి. అబుదాబిలోని అల్ దఫ్రా, దోహాలోని అల్ ఉదైద్, సౌదీలోని ప్రిన్స్ సుల్తాన్ వైమానిక స్థావరాలు, దుబాయ్‌లోని జెబెల్ అలీ పోర్ట్‌లపై ఇరాన్ దాడులు జరిగాయి. యూఏఈలోని అబుదాబి, దుబాయ్, ఖతార్‌లోని దోహా, సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లపై క్షిపణలతో దాడులు చేసింది.
ఈ నేపథ్యంలో యూఏఈ, దుబాయ్, టర్కీ సహా పలు దేశాలు తమ గగన తలాన్ని మూసివేశాయి. విమానాశ్రయాలను క్లోజ్ చేశాయి. ఈ నేపథ్యంలో ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్‌లో పాల్గొనేందుకు వెడుతున్న సింధు మార్గ మధ్యంలో దుబాయ్ విమానాశ్రయంలో చిక్కుకుపోయింది. ఈ పరీక్ష పీవీ సింధు సోషల్ మీడియాలో చేసిన ఓ వీడియో పోస్టులో స్వయంగా తెలియజేసింది. తన కళ్ల ముందే ఆకాశంలో క్షిపణి దాడులు జరుగుతున్నాయనీ, పేలుళ్ల శబ్దాలకు తీవ్ర భయాందోళనలకు గురౌతున్నట్లు. పరిస్థితి ఎప్పటికి కుదుటపడుతుందో.. ఇక్కడ నుంచి ఎప్పుడు బయటపడతానో అని ఆందోళనగా ఉందని పీవీ సింధు ఆ పోస్టులో చోటు చేసుకుంది. అదే పోస్టులో తన క్షేమం కాంక్షిస్తూ మెసేజీలు చేసి అందరికి ధన్యవాదాలు తెలిపాడు.
ఇలా ఉండగా.. ఇండియన్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ సింధుతో టచ్ లో ఉన్నామని. ఈ సమస్య త్వరలోనే పరిష్కారం అవుతుందన్న ఆశాభావం వ్యక్తం చేసింది. ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ కోసం మిగిలిన ఇండియన్ ప్లేయర్స్ అంతా ఇప్పటికే చేరుకున్నారని, సింధు శనివారం బయలుదేరారనీ వివరణ ఇచ్చింది. ఈ టోర్నీ మంగళవారం (మార్చి 3) నుంచి ప్రారంభం.

C.E.O
Cell – 9866017966
