Home Latest News పెళ్లిలో రాజుల కాలం నాటి ఆభరణాలు ధరించిన విజయ్, రష్మిక | విజయ్ మరియు రష్మిక తమ పెళ్లిలో రాచరికపు ఆభరణాలు ధరించారు ప్రత్యేకంగా – Jananethram News

పెళ్లిలో రాజుల కాలం నాటి ఆభరణాలు ధరించిన విజయ్, రష్మిక | విజయ్ మరియు రష్మిక తమ పెళ్లిలో రాచరికపు ఆభరణాలు ధరించారు ప్రత్యేకంగా – Jananethram News

by Jananethram News
0 comments
news-logo


తమ పెళ్లి వేడుకలో పాన్ ఇండియా స్టార్స్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంట ధరించిన ఆభరణాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ జంట ధరించిన ఆభరణాలపై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల పెళ్లి గురువారం (ఫిబ్రవరి 26) ఉదయ్‌పూర్‌లో అత్యంత ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే.

IT ఉదయసీ మెమెంటోస్‌లో చాలా తక్కువ మంది కుటుంబ సభ్యులు, బంధు మిత్రుల మధ్య ఈ పెళ్లి వేడుక జరిగింది. రష్మిక, విజయ్ ధరించిన పెళ్లి ఆభరణాలను హైదరాబాద్‌కు చెందిన ‘శ్రీ జ్యువెలర్స్’ తయారు చేసింది. పది నెలల ముందు నుంచే ఆభరణాల తయారీ పనులు మొదలయ్యాయి. ఆభరణాల కోసం కిలోల కొద్దీ బంగారం వాడినట్లు శ్రీ జ్యువెలర్స్ మేనేజింగ్ డైరెక్టర్లు అభిషేక్ అగర్వాల్, కౌశిక్ కుమార్ తెలిపారు.

రష్మిక, విజయ్‌లు ట్రెండ్‌ను ఫాలో అవ్వలేదు. పాత దనాన్ని కోరుకున్నారు. జంట కోరిక మేరకు శ్రీ జ్యువెలర్స్ వధూవరుల పెళ్లి ఆభరణాలను భారతీయ సంప్రదాయం ఉట్టిపడేలా తయారు చేసింది. మరీ ముఖ్యంగా రాజుల కాలం నాటి డిజైన్స్‌లో ఆభరణాలను తయారు చేసింది.

You may also like

Leave a Comment

Jananethram News delivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, Swendaily.com is your trusted source for timely and reliable news

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird