Home Latest News కల్వకుంట్ల కవితకు నైతిక విజయం.. ఇక దూకుడు మామూలుగా లేదుగా? | కల్వకుంట్ల కవితకు నైతిక విజయం| ఢిల్లీ| మద్యం| స్కామ్| చెప్పు| దేవతలు| ఆశీర్వాదం| ముందు| కొత్త – Jananethram News

కల్వకుంట్ల కవితకు నైతిక విజయం.. ఇక దూకుడు మామూలుగా లేదుగా? | కల్వకుంట్ల కవితకు నైతిక విజయం| ఢిల్లీ| మద్యం| స్కామ్| చెప్పు| దేవతలు| ఆశీర్వాదం| ముందు| కొత్త – Jananethram News

by Jananethram News
0 comments
news-logo


ఢిల్లీ మద్యం కుంభకోణంలో తెలంగాణ జాగృతి అధినేత్రి కల్వకుంట్ల కవితకు డిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు క్లీన్ చిట్ ఇవ్వడం నిస్సందేహంగా ఆమెకు నైతిక విజయం అని చెప్పవచ్చు. ఈ కేసులో తాను నిరపరాధినని తొలి నుంచీ కవిత చెబుతూనే వస్తున్నారు. ఇప్పుడు కోర్టు తీర్పు ఆమె మాటలే వాస్తవమని నిరూపించింది. మద్యం కుంభకోణం కేసులో తనకు క్లీన్ చిట్ ఇస్తూ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు వెలువరించినందుకు కవిత కృతజ్ఞతలు తెలిపారు.

కోర్టు తీర్పుపై మీడియాతో మాట్లాడిన కల్వకుంట్ల కవిత.. ఈ కేసులో తాను టార్గెట్ అయ్యానన్నారు. తాను రాజకీయ బాధితురాలురాలిన’ని, ఎవరిమీద ఉన్న అక్కసుతో తనపై ఈ కేసు అన్యాయంగా బనాయించి జైలుకు పంపారని కవిత అన్నారు. ఆమె వ్యాఖ్యలు పరోక్షంగా బీఆర్ఎస్ అగ్రనాయకత్వంపై విమర్శలుగా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు. ఢిల్లీ మద్యం కేసులో తాను రాజకీయంగా పావుగా మారానని చెప్పిన ఆమె.. అప్పుడే ఈ కేసు నుంచి తాను పులులు కడిగిన ముత్యం బయటకు వస్తానని చెప్పారు.

తాను కొత్త పార్టీ పెట్టడానికి సరిగ్గా నెలల ముందు వచ్చిన ఈ తీర్పు దేవుడి ఆశీర్వాదమని చెప్పారు. ఈ తీర్పుతో మరింత ఉత్సాహంగా ప్రజలలోకి వెడతానని చెప్పారు. ఈ కేసు విష‌యంలో త‌న‌కు ముందు నుంచి మ‌ద్ద‌తు తెలిపి వారికి ఆమె ధ‌న్య‌వాదాలు తెలిపారు. అదే సమయంలో ఈ కేసు విషయంలో తనకు బీఎస్ నుంచి ఎటువంటి మద్దతూ అందలేదని తెలుస్తోంది. త్వరలోనే బీఆర్‌ఎస్‌ కు సంబంధించిన మ‌రిన్ని విష‌యాల‌ను వెల్ల‌డిస్తాన‌న్న కవిత.. ఇప్ప‌టి వ‌ర‌కు త‌న‌పై అభాండాలు మోపి.. త‌న‌ను ప్ర‌జ‌ల మ‌ధ్య చ‌ల‌క‌న చేసిన రాష్ట్ర బీజ‌పీ నాయ‌కులు ఇప్పుడు ఏం స‌మాధానం చెబుతార‌ని నిలదీశారు.

ఇక కేటీఆర్ పై కూడా కవిత ఈ సందర్భంగా తీవ్ర విమర్శలు గుప్పించారు. ఢిల్లీ మద్యంకేసు కారణంగానే గత అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలలో బీఆర్ఎస్ ఓడిపోయిందంటూ తీర్పు వెలువడిన తరువాత కేటీఆర్ చేసిన ట్వీట్ పై కవిత అసలు తనపై కేసు పెట్టిందే పార్టీ కోసమన్నారు. ఓటమికి నన్ను బాధ్యురాలిని చేయడం సరికాదన్నారు. ఉద్యోగాలు, ఇళ్లు ఇవ్వకపోవటం, దోపిడీదారులకు టిక్కెట్లు ఇవ్వటం, అహంకారం కారణంగానే బీఆర్ఎస్ ఓడిపోయిందన్న కవిత, బీఆర్ఎస్ ను ప్రజలే తిరస్కరించారని, ఆ స్థానంలో ఇప్పటికైనా నిజాయితీగా అంగీకరించండని హితవు పలికారు.

You may also like

Leave a Comment

Jananethram News delivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, Swendaily.com is your trusted source for timely and reliable news

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird