*జననేత్రం న్యూస్ శ్రీకాకుళం జిల్లా బ్యూరో జూలై01*//: ఇచ్ఛాపురం బిటిఎ మండల శాఖ గౌరవాధ్యక్షులు రాయి సూర్యనారాయణని ఉద్యోగ విరమణ సందర్భంగా BTA రాష్ట్ర, జిల్లా, మండల కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు.
శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలంలో అనేక సంవత్సరాలు సేవలందించి, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతి పై ఇచ్ఛాపురం మండలం మండల ప్రాథమిక పాఠశాలలో విశిష్ట సేవలు అందించి ఉద్యోగ విరమణ పొందిన సందర్భంగా ఆయన సేవలు స్మరించి సన్మానించారు.
అంబేద్కర్ వాది, బడుగు బలహీన వర్గాల పక్షాన నిరంతర పోరాటాలు, ప్రజా పోరాటాలు జరిపిన నిరంతర శ్రామికుడు మరియు పనిచేసిన ప్రతిచోట గ్రామస్తుల మన్ననలు పొంది విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడంలో తనదైన ముద్ర వేసిన రాయి సూర్య నారాయణ మాస్టారు ఉపాధ్యాయ వృత్తికే తలమానికమని వక్తలు కొనియాడారు.
ఈ ఉద్యోగ విరమణ సన్మాన సభ లో బహుజన టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పేకేటి రామా రావు , శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు సీర రమేష్ బాబు మన్యం జిల్లా అధ్యక్షులు తందాడి అనిల్ కుమార్, బొచ్చ కోటేశ్వర రావు, దుప్పాడ ధర్మారావు, రామ్ జీ, యస్. భీమారావు తదితరులు పాల్గొన్నారు.


C.E.O
Cell – 9866017966
