*జననేత్రం న్యూస్ ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో జూన్23*//:ప్రజావాణి అర్జీలను పరిశీలించి వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి జిల్లా అధికారులను ఆదేశించారు
కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ లు డాక్టర్ పి. శ్రీజ, పి. శ్రీనివాస రెడ్డి లతో కలిసి అర్జీలు స్వీకరించారు.
ఖమ్మం పట్టణం పంపింగ్ వెల్ రోడ్డు గ్రీన్ మార్కెట్ ప్రాంతానికి చెందిన కొప్పు ప్రభావతి, కొప్పు పద్మావతి, కొప్పు సంపత్ కుమార్ లు 30వ డివిజన్ సర్వే నెంబర్ 135, 136 లో తమ ముగ్గురికి 4716 చదరపు గజాల స్థలం ఉందని, ఇందులో 616 గజాలు నగర పాలక సంస్థ ఆక్రమించి పార్క్ కట్టారని, తమ భూములు తమకు ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా తహసిల్దార్ ఖమ్మంకు రాస్తూ, అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.
చింతకాని గ్రామానికి చెందిన పి. జగన్నాథం తాను నిరుపేద దివ్యాంగుడినని, తనకు సదరం సర్టిఫికెట్ మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారికి రాస్తూ పరిశీలించి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు.
ఖమ్మం రూరల్ మండలం చింతపల్లి గ్రామానికి చెందిన సి.హెచ్. రామారావు సర్వే నెంబర్ 220 నందు 2 ఎకరాల 27 గుంటల వ్యవసాయ భూమి ఉందని, దీనిని కాలువ అలైన్మెంట్ కోసం సేకరణ చేశారని, మారిన అలైన్మెంట్ ప్రకారం ఒక ఎకరం 20 గుంటలు మాత్రమే స్వీకరించారని, సేకరించిన భూమిలో ఒక ఎకరం 7 గుంటల భూమి మిగిలిందని, దీనిని తిరిగి తనకు ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా, తహసిల్దార్ కు రాస్తూ పరిశీలించి నివేదికను 7 రోజులలో అందించాలని కలెక్టర్ ఆదేశించారు.
కొణిజర్ల మండలం బొట్లకుంట గ్రామానికి చెందిన గుర్రం అమృతమ్మ తన భర్తకు అంగవైకల్యం ఉందని, తాము చాలా పేదరికంలో ఉన్నామని, తమకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా, ఎంపిడిఓకు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు
ఈ ప్రజావాణిలో డిఆర్వో ఏ. పద్మశ్రీ, డిఆర్డిఓ సన్యాసయ్య, జిల్లా అధికారులు, కలెక్టరేట్ ఏవో సిహెచ్. స్వామి, తదితరులు పాల్గొన్నారు.





C.E.O
Cell – 9866017966
