Home Latest News చర్ల. ఇసుక ర్యాంపుల పేరుతో ఆదివాసి గ్రామాలలో గ్రూపులుగా గొడవలు పెట్రేగిపోతున్నాయి. (GSP) రాష్ట్ర అధ్యక్షులు. పాయం

చర్ల. ఇసుక ర్యాంపుల పేరుతో ఆదివాసి గ్రామాలలో గ్రూపులుగా గొడవలు పెట్రేగిపోతున్నాయి. (GSP) రాష్ట్ర అధ్యక్షులు. పాయం

by Jananethram News
0 comments

*జననేత్రం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో జూన్14*//:చర్ల మండలం శనివారం నాడు మండల కేంద్రంలో పూనెం వరప్రసాద్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో గోండ్వానా సంక్షేమ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు పాయం సత్యనారాయణ మాట్లాడుతూ చర్ల మండలంలో ముఖ్యంగా కొయ్యూరు పంచాయతీ పరిధిలో గల ఇసుక ర్యాంపులలో రేజింగ్ కాంట్రాక్టర్ల అనాశిత ఆలోచనతో ఆదివాసి గ్రామాలలో ఆదివాసిలు రెండు గ్రూపులుగా విడిపోయి గొడవలు పెట్టుకునే పరిస్థితి దాపరిచిందని వీటన్నిటికీ మూల కారణం బడా ఇసుక కాంట్రాక్టర్లు మరియు మితి మీరిన రాజకీయ జోక్యం తో ఆదివాసులు చిన్న భిన్నం అవుతున్నారని ఆరోపించారు.
షెడ్యూల్ ప్రాంత గోదావరి పరివాహక ప్రాంతాలైన బూర్గంపాడు నుండి ఏటూరు నగరం వరకు భద్రాచలం నుండి పేరూరు వరకు ఉన్నటువంటి ఇసుక ర్యాంపులలో బినామీ కాంట్రాక్టర్లతో ఆదివాసుల సహజ ఇసుక వనరులను పట్టణాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు.
పట్టాలు కడితే ఆదివాసీలు కోటీశ్వరులు అవుతున్నారని వస్తున్న వార్తల్లో నిజం లేదని. గడిచిన పది సంవత్సరాలు కాలంలో ఇసుక ర్యాంపులు నడిపాయి అందులో ఎంతమంది కోటీశ్వరులు అయ్యారు వారి యొక్క బ్యాంక్ బ్యాలెన్స్ ఇంటి స్థితిగతులను పరిశీలించాలని సూచించారు.
రోజువారి అవసరాల కోసం పనిచేసిన వచ్చే డబ్బులను చూసి కోటీశ్వరులు అయ్యారని చెప్పడంలో నిజం లేదని సూటిగా ప్రశ్నించారు..
ప్రశాంతంగా ఉన్నటువంటి ఆదివాసి గ్రామాలలో ఇసుక ర్యాంపుల పేరుతో బంధుత్వాలను చూడకుండా గొడవలు జరుగుతున్నాయని దీనంతటి కారణం కొంతమంది స్వార్థపరుల ఆలోచనతో ఇలాంటి గొడవలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఈ యొక్క కార్యక్రమంలో ఇర్ప ప్రకాష్ సోడి సురేష్. ఎలగల చందర్రావు ముత్తవరపు జానకిరామ్ పాల్గొన్నారు..

You may also like

Leave a Comment

Jananethram News delivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, Swendaily.com is your trusted source for timely and reliable news

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird