Home Latest News సన్‌రైజర్స్ నూతన సారథిగా ఇషాన్ కిషన్ | ఇషాన్ కిషన్| SRH కెప్టెన్| సన్‌రైజర్స్ హైదరాబాద్| IPL 2026| పాట్ కమిన్స్| IPL 2026| T20 వరల్డ్ కప్ 2026|సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ|భారత క్రికెట్| క్రికెట్ కెప్టెన్| BCCI – Jananethram News

సన్‌రైజర్స్ నూతన సారథిగా ఇషాన్ కిషన్ | ఇషాన్ కిషన్| SRH కెప్టెన్| సన్‌రైజర్స్ హైదరాబాద్| IPL 2026| పాట్ కమిన్స్| IPL 2026| T20 వరల్డ్ కప్ 2026|సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ|భారత క్రికెట్| క్రికెట్ కెప్టెన్| BCCI – Jananethram News

by Jananethram News
0 comments
news-logo


ఐపీఎల్ 2026 సీజన్ ఆరంభానికి ముందే సన్‌రైజర్స్ హైదరాబాద్ ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. జట్టు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్‌ను తమ కొత్త కెప్టెన్‌గా నియమిస్తున్నట్లు ప్రకటించారు. గత సీజన్లలో జట్టును నడిపించిన సీనియర్ స్థానంలో, దూకుడైన ఆటతీరు కిషన్‌కు బాధ్యతలు అప్పగించడం ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

గత కొద్ది కాలంగా సన్‌రైజర్స్ జట్టులో స్థిరత్వం కోసం యాజమాన్యం వివిధ ప్రయోగాలు చేస్తోంది. ఈ ఆఫర్నే జట్టులో నూతన ఉత్తేజం నింపేందుకు యువ రక్తాన్ని ప్రోత్సహించాలని నిర్ణయించుకుంది. కిషన్ తన అటాకింగ్ బ్యాటింగ్ శైలితో పాటు, వికెట్ల వెనుక ఉండి గేమ్ ప్లాన్ చేయడంలో దిట్ట అని పేరు తెచ్చుకున్నాడు. అందుకే అతనికి పగ్గాలు అప్పగించడం ద్వారా జట్టు రూపురేఖలు మారడానికి అవకాశం కల్పిస్తోంది.

2025-26 యాషెస్ సిరీస్ సమయంలో పాట్ కమిన్స్ తీవ్రంగా గాయపడ్డాడు. అప్పటి నుంచి అతడు మైదానంలోకి దిగలేదు. ఐపీఎల్ నాటికి ఆయన కోలుకుంటారా లేదా అనే విషయంపై ఫ్రాంచైజీకి ఇప్పటివరకు ఎటువంటి సమాచారం అందలేదు. ఈ నేపథ్యంలోనే ఇషాన్ కిషన్‌కు బాధ్యతలు అప్పగించాలని మేనేజ్‌మెంట్ నిర్ణయించినట్లు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కెప్టెన్‌గా జార్ఖండ్‌ను విజేతగా నిలిపి, మళ్లీ జాతీయ జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చాడు.

ఇటీవల ముగిసిన టీ20 వరల్డ్ కప్‌లో 2026లో ఇషాన్ కిషన్ అద్భుత ఫామ్‌ను కనబరిచాడు. న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్‌లో హాఫ్ సెంచరీ చేయడంతో పాటు, పాకిస్థాన్, నమీబియా మ్యాచ్‌ల్లో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డులను అందుకున్నారు. భారత్ రెండో తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.

ఈ మార్పుపై సన్‌రైజర్స్ అభిమానులు సామాజిక మాధ్యమాల్లో హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ వంటి ఫ్రాంచైజీకి యువ మరియు డైనమిక్ కెప్టెన్ అవసరమని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఇషాన్ కిషన్ నిషేధం ‘ఆరెంజ్ ఆర్మీ’ మరోసారి ఛాంపియన్‌గా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. జట్టు కూర్పులో కూడా కిషన్ తనదైన వేసే అవకాశం ఉంది.

రానున్న ఐపీఎల్ వేలంలో కిషన్ సూచనల మేరకు మరికొంత మంది ప్రతిభావంతులైనను జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. కొత్త కెప్టెన్, కొత్త వ్యూహాలతో సన్‌రైజర్స్ ఈసారి మైదానంలో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. కిషన్ సారథ్యంలో హైదరాబాద్ జట్టు మళ్లీ పూర్వవైభవాన్ని సంతరించుకోవాలని క్రీడాభిమానులు కోరుకుంటున్నారు.

You may also like

Leave a Comment

Jananethram News delivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, Swendaily.com is your trusted source for timely and reliable news

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird