Home సినిమా నందమూరి ఫ్యామిలీ రహస్యాలు బయటపెట్టిన చిట్టిబాబు! – Jananethram News

నందమూరి ఫ్యామిలీ రహస్యాలు బయటపెట్టిన చిట్టిబాబు! – Jananethram News

by Jananethram News
0 comments
tmdb-header-middle-logo


  • హరికృష్ణతో కలిసి సిగరెట్ తాగుతూ ఎన్టీఆర్‌కు దొరికిపోయిన చిట్టిబాబు!
  • హరికృష్ణ అంటే ఎన్టీఆర్ తండ్రికి ఎందుకు అంత ప్రాణం?
  • చిట్టిబాబు ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు!

నందమూరి తారకరామారావు క్రమశిక్షణకు మారుపేరు. తన లాగే తన చుట్టూ ఉన్న వారు కూడా క్రమశిక్షణతో ఉండాలి అనుకుంటారు. తాజాగా సీనియర్ నటుడు చిట్టిబాబు(చిట్టిబాబు) తెలుగువన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నందమూరి కుటుంబంతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా హరికృష్ణతో కలిసి చేసిన అల్లరి, ఎన్టీఆర్ కి దొరికిపోయిన సందర్భాలను ఆయన మనసు విప్పి మాట్లాడారు.

షూటింగ్ సమయంలో హరికృష్ణ, చిట్టిబాబు మంచి స్నేహితులు. ఒకసారి ‘బ్రహ్మంగారి చరిత్ర’ షూటింగ్ జరుగుతున్నప్పుడు, ఇద్దరూ కలిసి ఎవరికీ తెలియకుండా ఒక చెట్టు వెనుక సిగరెట్ తాగుతున్నారట. అయితే, అటుగా వచ్చిన ఎన్టీఆర్ చెట్టు వెనుక నుంచి పొగ రావడం చూసి, “ఏమిటి ఆ చెట్టు పక్కన పొగ వస్తోంది.. ఏదో అంటుకున్నట్లు చూడండి” అని గట్టిగా అరిచారట. ఆ గంభీరమైన స్వరం వినగానే హరికృష్ణ తో సహా చిట్టిబాబు భయంతో సిగరెట్ పారేసి అక్కడి నుంచి పరుగులు తీశారట. ఈ విషయాన్ని గుర్తుచేసుకుంటూ చిట్టిబాబు నవ్వుకున్నారు.

కేవలం సరదా ముచ్చట్లే కాదు, ఎన్టీఆర్ కి తన కొడుకుల పట్ల ఉన్న డెడికేషన్ గురించి కూడా చిట్టిబాబు ఆసక్తికర విషయాలు చెప్పారు. హరికృష్ణకి డ్రైవింగ్ అంటే ప్రాణం అని, ఎంతటి క్లిష్టమైన కొండ ప్రాంతాలనైనా జీపును అవలీలగా తోలెవారని కొనియాడారు. డ్రైవర్లు ఎక్కించలేని కొండ మీదకు కూడా హరికృష్ణ జీపును తీసుకువెళ్లేవారని, అది చూసి ఎన్టీఆర్ కూడా మురిసిపోయేవారని చెప్పారు.

ఎన్టీఆర్ గారి తండ్రికి (హరికృష్ణ తాతగారికి) కూడా మనవళ్లందరిలోకి హరికృష్ణ అంటే అమితమైన ప్రాణమని చిట్టిబాబు. షూటింగ్ సెట్‌కి వచ్చినప్పుడు బాలకృష్ణ కంటే హరికృష్ణకే ఎక్కువ ఫైట్ సీన్లు ఇవ్వమని డైరెక్టర్‌తో సరదాగా అనేవారట. నందమూరి కుటుంబంలో ఉన్న అనుబంధాలు, వారి మధ్య ఉన్న ప్రేమానురాగాలను చిట్టిబాబు ఈ ఇంటర్వ్యూలో కళ్ళకు కట్టినట్లు వివరించారు.

అలాగే బాలకృష్ణ గురించి మాట్లాడుతూ.. ‘బ్రహ్మంగారి చరిత్ర’ షూటింగ్ సమయంలో జరిగిన ఒక సంఘటనను వివరించారు. ఒక సీన్ కోసం బాలయ్య చెప్పులు లేకుండా ముళ్ళ పొదల్లో పరిగెత్తాల్సి వచ్చిందట. ఆ సమయంలో కాలికి ముళ్ళు గుచ్చుకుని రక్తం కారుతున్నా, ఎన్టీఆర్ మాత్రం “ఏం బాలా.. రెడీనా?” అని అడిగారట. తండ్రి క్రమశిక్షణకు తలవంచి బాలయ్య అలాగే రక్తసిక్తమైన పాదాలతో షూటింగ్ పూర్తి చేసారు, ఆ తర్వాతే ఎన్టీఆర్ ప్యాకప్ చెప్పి కొడుకును హాస్పిటల్ కి తీసుకెళ్లారని చిట్టిబాబు చెప్పారు.

చిట్టిబాబు చేసిన ఈ వైరల్ కామెంట్స్ చూస్తుంటే, అప్పట్లో షూటింగ్ సెట్స్ ఎంత సందడిగా ఉండేవో అర్థమవుతుంది. ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూ నెట్టింట హల్చల్ చేస్తోంది. నందమూరి అభిమానులు ఈ పాత జ్ఞాపకాలను చూసి మురిసిపోతున్నారు.

చిట్టిబాబు పూర్తి ఇంటర్వ్యూ కోసం, మరిన్ని ఆసక్తికర సినిమా అప్‌డేట్స్ కోసం మా ‘తెలుగువన్'(TeluguOne) యూట్యూబ్ ఛానల్ ని సబ్‌స్క్రయిబ్ చేసుకోండి.

You may also like

Leave a Comment

Jananethram News delivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, Swendaily.com is your trusted source for timely and reliable news

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird