Home Latest News అభివృద్ధి పనుల్లో ఖమ్మంను ఆదర్శంగా  తీర్చిదిద్దుతా… రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, చేనేత జౌళి శాఖల మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు*

అభివృద్ధి పనుల్లో ఖమ్మంను ఆదర్శంగా  తీర్చిదిద్దుతా… రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, చేనేత జౌళి శాఖల మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు*

by Jananethram News
0 comments

*నాట్ల కంటే ముందే రైతుల బ్యాంకు ఖాతాలో రైతు భరోసా జమ

*గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే మనకు రోగాలు రావు

*రఘునాథపాలెం మండలంలో పర్యటించి రోడ్డు, డ్రైన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేసిన మంత్రి తుమ్మల

       *జననేత్రం న్యూస్ ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో జూన్13*//:ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంలో పర్యటించి రోడ్డు, డ్రైన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలుఅభివృద్ధి పనుల్లో ఆదర్శంగా ఖమ్మంను తీర్చిదిద్దుతామని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, చేనేత జౌళి శాఖల మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వర రావు అన్నారు.
శుక్రవారం మంత్రివర్యులు రఘునాథపాలెం మండలంలో పర్యటించి రోడ్డు, డ్రైన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు.
రేగులచలక గ్రామం ఎస్సీ కాలనీలో 20 లక్షలతో నిర్మించనున్న అంతర్గత సీసీ రోడ్లు, డ్రైన్ నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన,  రేగులచలకలో 22 లక్షల 50 వేలతో నిర్మించిన అంతర్గత రోడ్లను ప్రారంభోత్సవం చేసారు.
కోయచలక గ్రామం ఎస్సీ కాలనీలో 20 లక్షలతో నిర్మించనున్న అంతర్గత సీసీ రోడ్లు, డ్రైన్ నిర్మాణ పనులకు, కోయచలక నుండి కామాంచికల్ వరకు 2 కోట్ల 50 లక్షలతో నిర్మించనున్న బి.టి. రోడ్డు నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన, కోయచలకలో 16 లక్షలతో నిర్మించిన అంతర్గత సీసీ రోడ్లను ప్రారంభోత్సవం చేసారు.
కోయచలక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల  ఆవరణలో ఏర్పాటు చేసిన సభలో *మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ* సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తూ ప్రజలకు అవసరమైన అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతున్నదని అన్నారు. గ్రామ అభివృద్ధి కోసం అందరూ ప్రశాంతంగా, కలిసి మెలిసి పని చేసుకోవాలని ఆయన సూచించారు.
రాష్ట్రంలో గత పాలకులు ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలను కొనసాగిస్తూ అదనంగా వేల కోట్ల రూపాయలను ఖర్చు చేసి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ సరఫరా, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని అన్నారు.
ప్రజా పాలనకు ప్రకృతి కూడా సహకరిస్తుందని, సమృద్ధిగా వర్షాలు పడుతున్నాయని రైతులు నాట్లు వేసేందుకు సిద్ధమయ్యారని,  నాట్ల కంటే ముందే రైతుల బ్యాంకు ఖాతాలో రైతు భరోసా నిధులు జమ చేయడం జరుగుతుందని అన్నారు.
గ్రామాలలో రోడ్లు ఇరుగ్గా ఉన్నాయని,  భవిష్యత్తులో ప్రజలకు ఇబ్బందులు వస్తాయని, గ్రామస్తులు చర్చించుకుని రోడ్డు విస్తరణ పనులు చేసేందుకు సహకరించాలని, ప్రజలు ఒప్పుకుంటే డబుల్ రోడ్డు వేస్తామని అన్నారు.  
మన గ్రామాలను పరిశుభ్రంగా పెట్టుకుంటే రోగాలు రావని, మన డబ్బులు మన చేతిలో ఉంటాయని, పిల్లలను ఉన్నత చదువులు చదివించుకొని సుఖంగా ఉండవచ్చని అన్నారు. అపరిశుభ్రత వల్ల కుటుంబాలు నాశనం అవుతాయని అన్నారు. అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేసిన తర్వాత వాటి నిర్వహణ కూడా పకడ్బందీగా జరగాలని అన్నారు.
రాష్ట్రంలో ఖమ్మం జిల్లాకు మంచి పేరు ఉందని, అభివృద్ధి పనుల కోసం ముఖ్యమంత్రిని ఒప్పించి మరో వంద కోట్లు తీసుకుని వచ్చిన వాటిని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూనే అభివృద్ధి పనులను సమాంతరంగా చేపడుతున్నామని అన్నారు.
కార్యక్రమంలో *మార్కెట్ కమిటీ చైర్మన్ హన్మంత రావు మాట్లాడుతూ* గత ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో పాటు అదనంగా ఆర్టిసి బస్సుల్లో మహిళలకు ప్రయాణం, సన్న బియ్యం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వంటి సంక్షేమ కార్యక్రమాల అమలుతో పాటు అభివృద్ధి పనుల్లో రాష్ట్రంలోని మిగిలిన నియోజకవర్గాల కంటే మెరుగ్గా ఖమ్మంను మంత్రి అభివృద్ధి చేస్తున్నారని అన్నారు.
రైతులకు మంత్రి అన్ని రకాలుగా అండగా ఉంటూ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని, రఘునాథపాలెం మండలంలో మంచుకొండ ఎత్తిపోతల పథకం  నిర్మించి చెరువులలో నీళ్లు నింపడం జరిగిందని అన్నారు.  ఖమ్మం నగరంలో వైద్య కళాశాల, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారని తెలిపారు.
అనంతరం మంత్రి, లబ్ధిదారులకు రేషన్ కార్డులను, కోయచలక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని, విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, స్కూల్ యూనిఫాంలను అందజేశారు. చిన్నపిల్లలకు అక్షరాభ్యాసం చేయించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, డి.సి.సి.బి. చైర్మన్ దొండపాటి వెంకటేశ్వర రావు, జెడ్పీ సిఈఓ దీక్షా రైనా, వ్యవసాయ శాఖ జిల్లా అధికారి డి. పుల్లయ్య, ఖమ్మం ఆర్డీఓ నరసింహారావు, ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment

Jananethram News delivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, Swendaily.com is your trusted source for timely and reliable news

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird