Home Latest News ప్రభుత్వం కల్పించిన బెస్ట్ అవైలబుల్  పథకంను వినియోగించుకోవాలి జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి మాడిశెట్టి. నరసింహస్వామి

ప్రభుత్వం కల్పించిన బెస్ట్ అవైలబుల్  పథకంను వినియోగించుకోవాలి జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి మాడిశెట్టి. నరసింహస్వామి

by Jananethram News
0 comments

*జననేత్రం న్యూస్ మహబూబాబాద్ జిల్లా బ్యూరో మే20*//:2025-26 విద్యా సంవత్సరానికిగాను బెస్ట్ అనేలబుల్ స్కూల్స్ (రెసిడెన్షియల్ & నాన్- రెసిడెన్షియల్) పథకం లో భాగంగా, ఉత్తమ పాఠశాలలను ఎంపిక చేయడానికి మహబూబాబాద్ జిల్లాలోని ప్రయివేట్ ఆంగ్ల మాధ్యమ పాఠశాలల నుండి ధరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని జిల్లా షెడ్యుల్డ్ కులాల అభివృద్ధి శాఖ అధికారి ఎం.నరసింహస్వామి నేడు ఒక ప్రకటనలో తెలిపారు.
1వ తరగతి విద్యార్థులు (నాన్- రెసిడెన్షియల్) పథకం క్రింద మరియు 5వ తరగతి విద్యార్థులు ( రెసిడెన్షియల్) పథకం ద్వారా డ్రా పద్ధతి ప్రకారం కలెక్టర్ గ అద్వర్యంలో ఎంపిక చేయబడునని, ఇందుకు గాను బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ రెసిడెన్షియల్ పథకంలోని 5వ తరగతి విద్యార్థులకు ట్యూషన్, హాస్టల్ వసతి, భోజన వసతితో పాటు రెండు జతల దుస్తులు, పాఠ్యపుస్తకాలు, మరియు నోట్ పుస్తకములకు గాను ప్రతి విద్యార్థికి రూ.42,000/- చొప్పున చెల్లించబడునన్నారు.
*బెస్ట్ అనేలబుల్ స్కూల్స్ (నాన్- రెసిడెన్షియల్) పథకం లో భాగంగా 1వ తరగతి విద్యార్థులకు ట్యూషన్, తో పాటు రెండు జతల దుస్తులు, పాఠ్యపుస్తకాలు, మరియు నోట్ పుస్తకములకు గాను ప్రతి విద్యార్థికి రూ.28,000/- చొప్పున చెల్లించబడునన్నారు*.
*దరఖాస్తు ఫారముల కొరకు షెడ్యుల్డ్ కులముల అభివృద్ధి శాఖ మహబూబాబాద్ జిల్లా సమీకృత కార్యాలయం* రెండవ అంతస్తు (రూమ్. నెం. 17) నందు 20/05/2025 నుండి ప్రతి పని దినములలో ఉదయం: 10.30 నుండి సాయంత్రం: 5.00 గంటల వరకు దరఖాస్తు ఫారములు ఇవ్వబడును మరియు పూర్తి చేసిన దరఖాస్తు ఫారములు తేది: 26/05/2025 వరకు మాత్రమే ఈ కార్యాలయం నందు మహబూబాబాద్ జిల్లలోని ప్రయివేట్ ఆంగ్ల మాధ్యమ స్వీకరించబడునని ఇట్టి అవకాశమును పాఠశాలలు సద్వినియోగం చేసుకోగలరని ఈ సందర్బంగా నరసింహస్వామి పేర్కొన్నారు.

You Might Also Like

You may also like

Leave a Comment

Jananethram News delivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, Swendaily.com is your trusted source for timely and reliable news

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird