*జననేత్రం న్యూస్ ప్రతినిధి మార్చ్20*//:రాష్ట్ర అభివృద్ధి పట్ల గాని,రాష్ట్ర సంక్షేమం పట్ల గాని, ఈ పాలకులకు అవగాహన లేదు. దూరదృష్టి లోపించింది అని స్పష్టం అవుతుంది. ఎక్కడ కూడా రాష్ట్ర ప్రగతి పట్ల,రాష్ట్ర ప్రజల సంక్షేమం పట్ల చిత్తశుద్ధి లేదు.
ప్రజల ఆకాంక్ష కి అనుగుణంగా లేదు ఈ బడ్జెట్.
ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ప్రజలు ఇచ్చిన హామీలను అమలు చేయాడానికి ప్రయత్నించినట్లుగా ఎక్కడ కూడా కనిపించడం లేదు.
ఉన్న ఆర్థిక పరిస్థితుల బట్టి అధికారులు, తయారుచేసిన ప్రసంగాన్ని… పాలకులు చదివి ప్రవేశపెట్టారు తప్ప,సంక్షేమం పట్ల గాని,రాష్ట్ర ప్రగతి పట్ల గాని దోహదపడేటట్లుగా విధంగా ఈ బడ్జెట్ లేదు.
ఉదాహరణకు చెప్పాలంటే, ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ వాళ్లు పెట్టింది.కేటాయించిన బడ్జెట్లో విద్యారంగానికి,15 శాతం నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.గగ్గోలు పెట్టారు.
ఇప్పుడు బడ్జెట్లో 7.5 శాతం మాత్రమే విడుదల చేశారు. ఇది కాంగ్రెస్ వాళ్ళ చిత్తశుద్ధికి నిదర్శనం.
ఏ రంగం చూసిన ప్రజలకు కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన హామీలను నెరవేర్చి దిశగా బడ్జెట్ లో పొందుపరచలేదు.
కళ్యాణ లక్ష్మి విషయంలో చూస్తే ఇప్పుడు ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఎక్కడ కూడా ప్రస్తావన లేదు.
పెన్షన్ విషయంలో కూడా బడ్జెట్ ప్రస్తావన లేదు. కాంగ్రెస్ వాళ్లు అన్ని ఇచ్చిన హామీలను మొత్తం చేతులెత్తేసినట్టుగానే భావించాలి.
అని చెప్పారు.


C.E.O
Cell – 9866017966
