*వేసవి దృష్ట్యా క్రచ్ సెంటర్ లో ఏసి ఏర్పాటు. *పిల్లలు ఆహ్లాదంగా గడిపేందుకు అవసరమైన ఏర్పాట్లు
*కలెక్టరేట్ లోని క్రచ్ సెంటర్ ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్
జననేత్రం న్యూస్ ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో*//:క్రచ్ సెంటర్ ను పిల్లలకు ఆకర్షణీయంగా ఆకట్టుకునే విధంగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ అన్నారు.
బుధవారం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, కలెక్టరేట్ లోని క్రచ్ సెంటర్ ను అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజతో కలిసి తనిఖీ చేసారు.
క్రచ్ సిబ్బంది రాణిని రోజువారి ఎంత మంది పిల్లలు ఉంటున్నది, అందిస్తున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ రాబోయే వేసవి కాలం దృష్టిలో ఉంచుకొని క్రచ్ సెంటర్లో ఏసి ఏర్పాటు చేయాలని, డోర్ మూసినప్పుడు చీకటి రాకుండా సెమీ ట్రాన్స్పరెంట్ డోర్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు. మంచి 5 స్టార్ రేటింగ్ ఉన్న ఏసీ కొనుగోలు చేయాలని అన్నారు. క్రచ్ సెంటర్ కు పిల్లలు బయటకు వెళ్ళకుండా చిన్న గేట్ ఏర్పాటు చేయాలని అన్నారు.
పిల్లలు క్రచ్ సెంటర్ లో ఆహ్లాదకరంగా గడిపేందుకు వీలుగా అవసరమైన ఆట వస్తువుల ఏర్పాటుకు వెంటనే చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. మహిళా ఉద్యోగుల కొరకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్రచ్ కేంద్రంలో చిన్న పిల్లల సంరక్షణకు అన్ని చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
మహిళా ఉద్యోగులు విధుల నిర్వహణకు ఇబ్బంది కలగకుండా వారి చిన్న పిల్లలను కార్యాలయానికి రాగానే సంరక్షణ కేంద్రం క్రచ్ లో సంరక్షకులకు అప్పగించి నిశ్చింతగా తమ విధులను సమర్ధవంతంగా ముగించుకొని, ఇంటికి వెళ్లెప్పుడు తిరిగి తీసుకొని వెళ్లవచ్చని అన్నారు.
ఈ తనిఖీలో జిల్లా కలెక్టర్ వెంట జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి కె. సత్యనారాయణ, క్రచ్ ఇంచార్జి రాణీ, అధికారులు, తదితరులు ఉన్నారు.





C.E.O
Cell – 9866017966
