Home Latest News ఖమ్మం కరుణగిరి ఆధ్యాత్మిక శోభలతో అంగరంగ వైభవంగా ముగిసిన కరుణగిరి పుణ్యక్షేత్ర యాత్ర మహోత్సవాలు.

ఖమ్మం కరుణగిరి ఆధ్యాత్మిక శోభలతో అంగరంగ వైభవంగా ముగిసిన కరుణగిరి పుణ్యక్షేత్ర యాత్ర మహోత్సవాలు.

by Jananethram News
0 comments

*జననేత్రం న్యూస్ ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో మార్చి03*// తెలుగు రాష్ట్రాల నుండి హాజరైన వేలాది మంది భక్తులు చివరి రోజు ఉదయం 9 గంటలకు ప్రార్ధన ప్రారంభం ఫాదర్ బిన్నీ ఉపవాస ప్రార్థన మరియు దివ్యసప్రసాద మందసారాధన జరిపారు అనంతరం ఈనాటి ప్రత్యేక ఆహ్వానితులు కర్నూలు పీఠాధిపతులు బిషప్ శ్రీశ్రీశ్రీ గోరంట్ల జర్నీస్ తండ్రి మరియు మన ఖమ్మం పిఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ సగిలి ప్రకాష్ తండ్రి కలిసి సమిష్టి దివ్య పూజా బలి నిర్వహించారు. వారు మాట్లాడుతూ దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలని ప్రజలందరూ ఈ నూతన సంవత్సరంలో ఆయురారోగ్యంగా ఉండాలని దీవించారు అదేవిధంగా ఈ మహా పూజలో గురువులు కన్యాస్త్రీలు బ్రదర్ లు వేలాది మంది ప్రజలు పాల్గొన్నారు కరుణగిరి డైరెక్టర్ ఫాదర్ మ్యాచ్ వరప్రసాద్ ఆధ్వర్యంలో ఈ పండుగను చానా ఘనంగా నిర్వహించారు ఈ నిర్వహణలో కొరవి థామస్ ఆధ్వర్యంలో పాటలను చాలా చక్కగా ఆలపించారు. పూజ అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలలో మొదటి బహుమతి 10000, 5000 ,3000 అందజేశారు నూతన వరవడిని సృష్టించిన నూతన బిషప్ డాక్టర్ సగిలి ప్రకాష్ . వీరికి సహకరించిన వికారి జనరల్ శౌరి, ప్రోక్రైటర్ ఫాదర్ ఐజాక్, ఛాన్సలర్ జర్నీస్ ఫాదర్ విజయ్ సంఘ పెద్దలు ఉపదేశీయులు వివిధ సంస్థల అధిపతులు ప్రత్యక్ష ప్రసారం అందజేసిన హైదరాబాద్ దివ్యవాణి ఛానల్ మరియు యావే మరియా ఛానల్ కు మరియు మీడియా ప్రతినిధులకు రాజకీయ నాయకులకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపిన కనిగిరి పుణ్యక్షేత్ర యాత్ర మహోత్సవ నిర్వహణ కమిటీ

You Might Also Like

You may also like

Leave a Comment

Jananethram News delivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, Swendaily.com is your trusted source for timely and reliable news

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird