Home Latest News పులి సంచారంతో భయంభయం | పోలవరం నిర్వాసిత గ్రామాల్లో పులి ఉద్రిక్తత | TigerNews | దేవీపట్నం | నేలకోట ఫారెస్ట్ | అటవీ శాఖ – Jananethram News

పులి సంచారంతో భయంభయం | పోలవరం నిర్వాసిత గ్రామాల్లో పులి ఉద్రిక్తత | TigerNews | దేవీపట్నం | నేలకోట ఫారెస్ట్ | అటవీ శాఖ – Jananethram News

by Jananethram News
0 comments
news-logo


పోలవరం ప్రాజెక్టు నిర్వాసిత గ్రామాల్లో పెద్దపులి సంచారం ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. గత కొన్ని రోజులుగా అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం నుండి అనేక ప్రాంతాల్లో పులి కదలికలు కనిపించడంతో స్థానిక తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ముఖ్యంగా కొండ ప్రాంతాల్లో నివసించే గిరిజనులు, వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవిస్తున్నారు.

ప్రస్తుతం దేవీపట్నం వారి నేలకోట కొండ ప్రాంతాన్ని ఈ పులి తన ఆవాసంగా మార్చుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. గత నాలుగు రోజులుగా ఈ పరిసరాల్లోనే పులి తిరుగుతున్నట్లు స్థానికులు పేర్కొన్నారు. పశువుల కాపరులు, కొండపైకి వెళ్లే గ్రామస్థులు పులిని నేరుగా చూడటంతో విషయం వెలుగులోకి వచ్చింది. రామదుర్గం కొండపై పులి కదలికలను కొందరు సెల్ ఫోన్లలో చిత్రీకరించారు. అయితే మనుషులను చూస్తే సాధారణంగా పులులు వయలెంట్ అవుతాయి. కానీ ఈ పులి మాత్రం మనుషులను చూసి నెమ్మదిగా వెనక్కు పోయినట్లు స్థానికులు చెబుతున్నారు.

సమాచారం అందుకున్న శాఖ అధికారులు తక్షణమే రంగంలోకి దిగారు. పులి అడుగుజాడల ఆధారంగా అది ఎటువైపు వెళ్తుందో పర్యవేక్షిస్తున్నారు. పులిని బంధించడానికి అవసరమైన చర్యలు. ఇందులో భాగంగా పులి సంచరిస్తున్న ప్రాంతాల్లో బోన్లు ఏర్పాటు చేశారు. నిరంతరం నిఘా ఉంచేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.

ప్రజల రక్షణ దృష్ట్యాశాఖ అధికారులు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. పొలం పనులకు వెళ్లేవారు ఒంటరిగా వెళ్లకూడదని, గుంపులుగా వెళ్లాలని సూచించారు. సాయంత్రం వేళల్లో ప్రాంతాలకు సమీపంలో ఉన్న ఇళ్ల నుంచి బయటకు రాకూడదని సూచించారు. పశువులను అడవి వైపు తీసుకెళ్లరాదని తెలిపారు. పులి కనిపిస్తే వెంటనే అధికారులకు సమాచారం అందించాలని. గండి పోచమ్మ ఆలయ సందర్శనకు వచ్చే భక్తులు కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు. త్వరగా పులిని బంధించి సురక్షిత తరలించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

You may also like

Leave a Comment

Jananethram News delivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, Swendaily.com is your trusted source for timely and reliable news

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird