
కడప జిల్లా మద్యం బాంబులు తాగేశారు. జిల్లాను మద్యం మత్తులో ముంచేశారు. సర్కారు ఖజానాకు కాసుల వర్షం కురిపించారు. మామూడురోజుల క్రితం గత ఏడాది ఆర్థిక సంవత్సరంలో ఏకంగా వెయ్యి కోట్లకు పైగా గుట గుట తాగేశారు. చంద్రబాబు ప్రభుత్వం నాణ్యమైన మద్యం ఒప్పందామని చెబుతున్న ఈ మధ్యం విక్రయాలకు వేల పాలా లేదు. తెల్లజాము నుంచే విక్రయాలు సాగిస్తూ ఉండటంతో ఎప్పుడు కావాలంటే అప్పుడు మందు దొరికే పరిస్థితి రోడ్లపై కనిపిస్తుంది. అందుకోసం తోడు బెల్ట్ షాపులు జిల్లా వ్యాప్తంగా వ్యాపించడంతో కావలసిన వారికి కావల్సినంత మందు దొరుకుతుంది. దీనితో ముందు బాబులు మద్యం మత్తులో మునిగి జిల్లాను కూడా మత్తులో తడిపేశారు
*ఖజానాకు కాసుల వర్షం
ఏడాదికి రూ. 1,155.77 కోట్ల ఆదాయం అంటే నెలకు సగటున రూ. 96.31 కోట్ల రూపాయలు మధ్యం తాగేశారు .కొత్త మద్యం విధానంతో నాణ్యమైన బ్రాండ్ల పేరుతో గత ప్రభుత్వంలో కనిపించని బ్రాండ్లు అందుబాటులోకి రావడంతో విక్రయాలు మరింత పుంజుకున్నాయి. కేవలం మార్చి నెలలోనే రూ. 101.96 కోట్లు ఆదాయం రావడం.
*కష్టం జీవుల వాటానే అధోకం
కోట్ల రూపాయల ఆదాయంలో 80 శాతం వాటా రెక్కాడితే గానీ డొక్కాడని పేదవాడిదేనని చెప్పవచ్చు.కొందరైతే
సాయంత్రం వేళ కూలీ డబ్బులతో నేరుగా మద్యం షాపులకే చేరుతున్నారు. దీంతో ఆ కుటుంబాలు చిన్నా భిన్నం అవుతున్నాయి.మద్యానికి బానిసలై వారి పిల్లలు భవిష్యత్తుపై ఈ ప్రభావం పడుతోంది. తండ్రి తాగుడుకు బానిస కావడంతో ఫీజు కట్టలేక పిల్లలు చదువు మానేసి బాలకార్మికులుగా మారుతున్నారు. మితిమీరి మద్యం సేవించడం వల్ల లివర్, కిడ్నీ వ్యాధులతో చిన్న వయసులోనే పురుషులు మరణిస్తున్నారు. దీంతో అనేక కుటుంబాల్లో మహిళలు అనాథలుగా, పిల్లలు దిక్కులేని వారిగా మారుతున్నారు.
*రూ,1155.77 కోట్ల విక్రయాలు
జిల్లాలో ఏర్పాటైన 139 మద్యం షాపుల ద్వారా 2025- 26 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో మద్యం విక్రయాలు జరిగాయి. జిల్లా 9 ఎక్సైజ్ స్టేషన్ల పరిధిలో 1155. 77 కోట్ల రూపాయల మద్యం విక్రయాలు జరగడం చూస్తే మందుబాబులు మద్యం తాగడానికి మాత్రం లోటు లేదనే చెప్పాలి. ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ లవారిగా జరిగిన మద్యం అమ్మకాలు వెలుగులోకి బద్వేలు పోలీస్ స్టేషన్ పరిధిలో 128.5 కోట్ల రూపాయల మద్యం విక్రయాలు జరిగాయి.
అలాగే జమ్మలమడుగులో 84.57 కోట్లు, కడపలో 312. 37 కోట్లు ,ముద్దనూరులో 47.76 కోట్లు ,మైదుకూరులో 112.23 కోట్ల రూపాయల మద్యం విక్రయాలు జరిగాయి. ప్రొద్దుటూరు పోలీసు స్టేషన్ పరిధిలో రూ,202.72 కోట్లు, పులివెందులలో 138.77 కోట్లు, సిద్ధవటంలో 36.79, కోట్లు , ఎర్రగుంట్ల లో91.71 కోట్ల రూపాయల మద్యం విక్రయాలు జరిగాయి. తొమ్మిది పోలీస్ స్టేషన్లలో 1155.77 కోట్ల రూపాయల మధ్య విక్రయాలు కరువు కడపన రికార్డు సృష్టించాయి
*మొదటి స్థానంలో కడప
మద్యం సేవించడంలో కడపలో మందుబాబులు మొదటి స్థానంలో ఉన్నారు. కడప ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో 312.37 కోట్ల రూపాయల మద్యం తాగేశారు .రెండో స్థానంలో ప్రొద్దుటూరులో 202. 72 కోట్ల రూపాయల మద్యం విక్రయాలు జరిగాయి. మూడో స్థానంలో 138.77 కోట్లతో పులివెందుల ఉంది .నాలుగో స్థానంలో బద్వేలు లో 128 .85 కోట్ల రూపాయల మద్యం సేవించారు. మొత్తంగా ఏడాదికి 1155.77 కోట్ల రూపాయలు మద్యం తాగారంటే కడప కు ఏ స్థాయిలో మత్తెక్కించారో ఊహించవచ్చు.
*ఒక్క నెలలో 11.66 లక్షల బీర్లు గుట గుట
వేసవి తాపం తీరేలా చైల్డ్ చిల్డ గా గుట గుట బీర్లు తాగేశారు. గత నెలలో ముదిరిన ఎండలు బీర్లకు బలే గిరాకీ తెచ్చాయి. ఈ మార్చి నెలలో జిల్లాలో 97424 కేసులు అంటే 1168088 బీర్లు తాగేశారు. వారిలో ఫిబ్రవరి 66965 కేసుల బీర్లు అమ్మకాలు జరిగితే మార్చిలో అంతకు మించి 32759 బీర్లు అదనంగా అమ్మకాలు జరిగాయి.
నియోజకవర్గాల వారిగా ‘మత్తు’ లెక్కలు (మార్చి నెలలో ఉన్నాయి):
జిల్లాలోని ప్రధాన కేంద్రాల్లో మద్యం విక్రయాల సరళిని పరిశీలించే, పట్టణ ప్రాంతాల్లో వినియోగం అత్యధికంగా ఉంది. ఒక్క మార్చి నెలలోనే 101 కోట్ల రూపాయల వ్యాపారం జరిగింది.ఏప్రిల్ ఒకటి నుండి మొదలైన 2026- 27 ఆర్థిక సంవత్సరంలో మరెంత స్థాయిలో మద్యం మత్తు కడపను ముంచెత్తుతుందో చూడాలి.

C.E.O
Cell – 9866017966

