Home సినిమా కార్మేని సెల్వం మూవీ రివ్యూ – Swen Daily

కార్మేని సెల్వం మూవీ రివ్యూ – Swen Daily

by
0 comments
tmdb-header-middle-logo


పాత్‌వే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అరుణ్ రంగరాజులు నిర్మాతగా రామ్ చక్రి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో రూపొందించిన ద్విభాషా చిత్రం ‘కార్మేని సెల్వం’. విలక్షణ నటులు సముద్రఖని, లక్ష్మీ ప్రియ జంటగా నటించిన ఈ చిత్రంలో గౌతమ్ వాసుదేవ్ మీనన్, అభినయ కీలక పాత్రలు పోషించారు. ఏప్రిల్ 3న తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన ఈ చిత్రం కంప్లీట్ క్లీన్ ఫ్యామిలీగా ప్రేక్షకుల మన్ననలు అందుకుంటోంది.

కథ:
ఇప్పటి సమాజంలో డబ్బుకు ఎంత ప్రాధాన్యత ఉందో, అది కుటుంబ బంధాలను ఎలా ప్రభావితం చేస్తుందో ఈ చిత్రం చాలా సున్నితంగా చూపిస్తుంది. ఎక్కడా బోర్ అనిపించకుండా, భావోద్వేగాలతో ముందుకు సాగుతుంది. సెల్వం అనే కార్ డ్రైవర్ పాత్రలో సముద్రఖని నటించారు. ఆయన భార్యగా లక్ష్మీప్రియ కనిపించారు. సంపత్, దేవి (గౌతమ్ మీనన్, అభినయ) దంపతుల దగ్గర సెల్వం కార్ డ్రైవర్‌గా పనిచేస్తారు. ఆయన భార్య లక్ష్మీ ఇడ్లీ బండి నడుపుతూ.. కుటుంబానికి ఆర్థికంగా తోడుగా ఉండనుంది. సొంత ఇల్లు, కారు కొనుకోవాలనే కలతో వీరిపయనం సాగిస్తూ ఒక్కో రూపాయి సేవ్ చేసుకుంటారు. ఓసారి సెల్వం చెల్లెలి కూతురి శుభకార్యానికి వెళ్లి అక్కడ అవమానాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. తన భర్తకు మాట రాకూడదనే తలపుంతో దాచుకున్న సొమ్ముతోపాటు మెడలోని తాళి బొట్టు కూడా అమ్మేసి వారికి సారె పెడుతుంది లక్ష్మీ. అది జరిగిన కొన్ని రోజులకే అనుకోకుండా సెల్వం కుమారుడి తలకు గాయం కావడంతో వైద్యానికి డబ్బులు అవసరమవుతాయి. దీనికోసం తప్పని పరిస్థితుల్లో సెల్వం బావ దగ్గర పదివేల రూపాయలు అప్పు చేస్తాడు. సంపత్ దంపతులు నెలరోజుల వెకేషన్‌కు ఫారిన్ వెళ్లడంతో తన కారును ట్యాక్సీగా మార్చి క్యాబ్ డ్రైవర్‌గా మారతాడు. ఈ క్యాబ్ ఎక్కే ప్రతివారి నుంచి ఏదో ఒకటి తెలుసుకుని అలా ప్రయత్నం చేయాలి. ‘డబ్బు సంపాదించాలంటే డబ్బున్న వాడిలా ప్రవర్తించాలి..’ అని ఒకరు చెప్పడంతో ఫ్యామిలీతో ఓ స్టార్ హోటల్‌కు వెళ్లి అనవసర ఖర్చులు పెడతాడు. అలాగే ‘అప్పులు చేస్తేనే గొప్పోళ్లు అవుతారు’ అని మరొకరు చెప్పడంతో క్రెడిట్ కార్డు ద్వారా తన అవసరాలను తీర్చుకుంటూ, రాత్రింబవళ్లు క్యాబ్ నడిపి కష్టపడి కొంత డబ్బులు దాచుకుని, మరికొంత అప్పు చేసి మరీ ఊరి చివరన రెండు వందల గజాల స్థలం కొంటాడు. కానీ వాళ్ల భార్యకు మాత్రం అప్పు చేయడం ఏ మాత్రం ఇష్టం ఉండదు. ఒకానొక సందర్భంలో అప్పులు బాధలు ఎక్కువై ఇంట్లో ఉన్నా లేడని చెప్పుకునే పరిస్థితి నెలకొంటుంది. ఈ అప్పుల బాధలు తట్టుకోలేక దుబాయ్‌లోని షార్జాకు వెళ్లి కారు నడుపుతూ డబ్బు సంపాదించుకుంటాడు. అక్కడ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు? భార్య, బిడ్డలను మిస్ అవుతూ ఎలా సఫర్ అయ్యాడనేది ఆసక్తికరంగా చూపించారు.

విశ్లేషణ:
బ్యూటీఫుల్ ఎమోషన్స్, ఫ్యామిలీ రిలేషన్స్‌తో సాగే చక్కటి కుటుంబకథా చిత్రమిది. ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ వరకు ఎలాంటి వల్గారిటీ లేకుండా, మద్యపానం, ధూమపానంతో పాటు ఒక్క బూతుపదం కూడా లేకుండా ఇటీవల కాలంలో వచ్చిన సినిమా ఇది. మధ్యతరగతి కుటుంబ విలువలను చాటిచెప్పేలా సాగుతూ, ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయ్యేలా ఉంది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్’ వాళ్లను డబ్బు ఎలా ప్రభావితం చేస్తుందనేది చాలా రియలిస్టిక్‌గా చూపించిన విధానం ఆకట్టుకుంది. హృదయానికి హత్తుకునే ఈ చిత్రం.. డబ్బు, కుటుంబం, సంబంధాల మధ్య నడుస్తూ ప్రతి ఒక్కరికీ రిలేట్ అయ్యేలా ఉంటుంది. ‘అనవసరం అయినవి కొంటే.. అవసరమైనని కోల్పోతాం’ అని క్లైమాక్స్‌లో వచ్చే డైలాగ్ సినిమా డెప్ట్‌ను సూచిస్తుంది.

నటీనటులు:
సముద్రఖని తన సహజమైన నటనతో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఆయన పాత్రలో ఉన్న లోతు, భావోద్వేగాలు ఎంతో సహజంగా కనిపిస్తాయి. సెల్వం పాత్రలో సముద్రఖని నటించిన తీరు ప్రతి ఒక్కరినీ రిలేట్ చేసుకునేలా ఉంటుంది. మధ్యతరగతి భర్తగా, మధ్యతరగతి తండ్రిగా తనదైన ఎమోషన్స్‌ను పండించారు. ఆయన భార్యగా లక్ష్మీ ప్రియా నటన ప్రతి మహిళకు కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. గౌతమ్ మీనన్, అభినయ పాత్రల నిడివి తక్కువే అయినా కథపై బలమైన ప్రభావం చూపిస్తారు. మిగిలిన ఆర్టిస్టులంతా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

నిపుణులు సాంకేతిక:
దర్శకుడు రామ్ చక్రి ఈ కథను చాలా సహజంగా, రియలిస్టిక్‌గా తెరకెక్కించారు. ప్రతి సీన్లోనూ ఒక జీవం కనిపిస్తుంది. ఆడియెన్స్‌కి బాగా ఫ్యామిలీ కనెక్ట్ అయ్యేలా చేశారు. సినిమాటోగ్రాఫర్ యువరాజ్ దక్షణ్ అందించిన విజువల్స్ ప్లెజెంట్‌గా ఉన్నాయి. మ్యూజిక్ ఈ అదనపు బలం. రామానుజన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఎమోషన్స్‌ను మరింత ఎలివేట్ చేస్తుంది.


హైలైట్స్:

సముద్రఖని అద్భుత నటన
బలమైన కథ, భావోద్వేగాలు
కుటుంబ ప్రేక్షకులకు దగ్గరైన అంశాలు
రియలిస్టిక్ టేకింగ్
ఎలాంటి అసభ్యకర సన్నివేశాలు లేని కంప్లీట్ క్లీన్ ఫ్యామిలీ మూవీ

ఫైనల్‌గా:

“కార్మేని సెల్వం” ఒక సాధారణ కథను అసాధారణంగా చెప్పిన మంచి సినిమా. భావోద్వేగాలు, కుటుంబ విలువలను ఇష్టపడే వారికి తప్పకుండా నచ్చుతుంది.

రేటింగ్: 2.5/5

You may also like

Leave a Comment

Jananethram News delivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, Swendaily.com is your trusted source for timely and reliable news

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird