
-డెకాయిట్ తో ఎల్లుండి మృణాల్ సందడి
-మరి తెలుగు సినిమా చేయనని ఎందుకు చెప్పింది
-అలా చెయ్యడానికి కారణం ఏంటి
-విషయాన్ని బయటపెట్టిన డైరెక్టర్
సిల్వర్ స్క్రీన్, మేకర్స్, హీరో, బాక్స్ ఆఫీస్ కి లక్కీ హీరోయిన్ ఎవరంటే మృణాల్ ఠాకూర్. (Mrunal Thakur)అంతలా తన ఛరిష్మాతో సినీ శాసనాన్నే సృష్టించుకుంది. ఈ నెల 10 న వస్తున్న ‘డెకాయిట్'(Dacoit)పై పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి. అడివిశేష్(అడివి శేష్)హిట్ ట్రాక్ లోనే నడుస్తున్న మృణాల్ రాకతో హిట్ పై మరింత నమ్మకం ఏర్పడింది. మరి అలాంటి మృణాల్ ఇక నేను తెలుగు సినిమాలు చేయనని చెప్పడం చర్చనీయాంశ మయ్యింది. ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం.
మృణాల్ ప్రీవియస్ మూవీ హాయ్ నాన్న సాధించిన ఘనవిజయం. యష్ట అనే క్యారక్టర్ లో రెండు విభిన్న షేడ్స్ లో మృణాల్ కనపర్చిన పెర్ఫార్మ్ కి మెస్మరైజ్ కానీ ప్రేక్షకుడు ఉండడు.అసలు ఆ క్యారక్టర్ లో తనని తప్ప మరొకరిని ఊహించే సాహసం. ఆ చిత్ర దర్శకుడు శౌర్యువ్(శౌర్యువ్)నిన్న డెకాయిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరయ్యాడు. ఈ సందర్భంగా మాట్లాడుతు హాయ్ నాన్న షూటింగ్ టైంలో మృణాల్ నాకు ఫోన్ చేసి ఇక నా వల్ల కాదు. తెలుగు సినిమా చేయనని చెప్పేది. బహుశా భాషాపరమైన ఇబ్బందులు, క్యారక్టర్ లో ఒదిగిపోయే అవకాశం వచ్చే ఒత్తిడేమో తెలియదు గాని, ఇక తెలుగులో చేయనని చెప్పింది. కానీ నేను ఆ మాటలు పెద్దగా పట్టించుకోలేదు. తన యాక్టింగ్ కి ఉన్న శక్తి నాకు తెలుసు. ఇప్పుడు ఈ మాటలు సినీ సర్కిల్స్ లో వైరల్ గా మారాయి.
కూడా చదవండి: Ntr:దయచేసి రూమర్స్ నమ్మకండి
ఇక అభిమానులు సూచిస్తున్నారు మృణాల్ గారు మీరు తెలుగు సినిమాకి చాలా రోజుల తర్వాత దొరికిన అందమైన హీరోయిన్, అందమైన పెర్ఫార్మ్ ప్రదర్శించిన నటి. డెకాయిట్ కి ముందే మాకు ఈ విషయం తెలిస్తే కనుక, ముంబై మీ ఇంటి ముందు టెంట్ వేసి మరి నిరాహార దీక్ష చేసే వాళ్ళం. మా అభిమానం ఎలా ఉంటుందో గత హీరోయిన్స్ ట్రాక్ రికార్డు చూసుకోండి. సీతారామంతోనే ఈ విషయంలో ఫిక్స్ అయ్యిపోయాం అనే కామెంట్స్ చేస్తున్నారు. మహారాష్ట్రలోని ధూలే ఏరియాకి చెందిన మృణాల్ 2014లో ‘హలో నందన్’ అనే మరాఠి చిత్రం ద్వారా సినీ ప్రస్థానాన్ని ప్రారంభించింది. డెకాయిట్ తెలుగులో నాలుగో చిత్రం.


