
-బర్త్ డే సందర్భంగా టైటిల్ రిలీజ్
-టైటిల్ ఇదే
-ఇక రికార్డులే తరువాయి అంటున్న ఫ్యాన్స్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(అల్లు అర్జున్),అట్లీ(అట్లీ)కాంబోలో తెరకెక్కుతున్న మూవీ టైటిల్ వచ్చేసింది. రావడమే కాదు ఎన్నో ప్రశ్నలకి సమాదానాలు వెతుకుతుండడంతో పాటు కథ ఏమై ఉంటుందనే ఆలోచన రిలీజ్ టైం వరకు నిత్యం ఊహించుకునేలా ఉంది. మరి టైటిల్ చూద్దాం.
రాకా(Raaka).. టైటిల్ ఇదే… అల్లు అర్జున్ లుక్ తో రిలీజ్ చేసారు. పొడవటి గోళ్ళతో ఉన్న అల్లు అర్జున్ అతీంద్రియ శక్తుల్ని నింపుకున్న మహాశక్తినిరా అన్నట్టుగా చూస్తున్నాడు. చూపులు చాలా కన్నింగ్ గా ఉన్నాయి. కనురెప్పల డిజైన్, నెత్తిపై జుట్టు లేకుండా చూస్తే అల్లు అర్జున్ ‘రాక’ గా పెద్ద గత్తరనే లేపేలా ఉన్నాడు. టైటిల్ తో పాటు లుక్ పై అల్లు అర్జున్ ఫ్యాన్స్ పాన్ ఇండియా లెవల్లో ‘రాకా’తో భారతీయ చిత్ర పరిశ్రమలో సరికొత్త సునామి నమోదవ్వడం ఖాయమని అంటున్నారు.
ఇది కూడా చదవండి: అల్లు అర్జున్: బర్త్ డే విశేషాలు చెప్పడానికి భారీగా చేరిన ఫ్యాన్స్.. 11 గంటలకు నో ట్రాఫిక్
సన్ పిక్చర్స్ కానీ వీని ఎరుగని బడ్జెట్ తో నిర్మిస్తుండగా సాయి అభ్యంకర్ మ్యూజిక్ అందించాడు. దీపికా పదుకునే ఒక హీరోయిన్ కాగా మరో నలుగురు హీరోయిన్స్ కి చోటు ఉన్నట్లు తెలుస్తుంది. ఈ రోజు అల్లు అర్జున్ బర్త్ డే అంటే తెలుస్తుంది.
.


