Home Latest News డాలర్ పతనం.. అమెరికా అగ్రహోదాకు గండం? | డాలర్ క్షీణత | సూచించు | బెదిరింపు | అమెరికా | మహాశక్తి – Jananethram News

డాలర్ పతనం.. అమెరికా అగ్రహోదాకు గండం? | డాలర్ క్షీణత | సూచించు | బెదిరింపు | అమెరికా | మహాశక్తి – Jananethram News

by Jananethram News
0 comments
news-logo


అమెరికా అగ్రరాజ్య హోదాను వేగంగా కోల్పోతుందా? ఆ దేశానికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై పట్టు ఏర్పడడానికి కారణమైన డాలర్ పతనం.. అమెరికా ప్రాభవాన్ని దెబ్బతీస్తోందా? అంటే.. ప్రపంచ ఆర్థిక నిపుణుల నుంచి ఔనన్న సమాధానమే వస్తున్నది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అవలంబిస్తున్న దూకుడు రాజకీయాలు, ఇతర దేశాలపై హేతురహితంగా ప్రకటించిన టాక్స్ వార్ కారణంగా ప్రపంచ దేశాలలో అమెరికా తన పరపతిని వేగంగా కోల్పోతోంది. ఇక పశ్చిమాసియాలో ఉద్రిక్తతలకు ట్రంప్ అహంకారమే కారణమన్న భావన సర్వత్రా వ్యక్తమవుతోంది.

ఇరాన్ పై అమెరికా దాడులు, పర్యవశానాల కారణంగా అమెరికా ఆర్థిక విశ్వసనీయత ప్రశ్నార్థకమైందని ఆర్థిక నిపుణులు అంటున్నారు. సౌదీ అరేబియాతో కుదుర్చుకున్న ఒప్పందం వల్ల చమురు వాణిజ్యమంతా అమెరికాలోనే జరగడం ఇప్పటి వరకూ కొండంత అండగా నిలిచింది. అయితే ప్రస్తుత పరిస్థితిలో మార్పు వచ్చింది. అమెరికా ఆధిపత్యాన్ని అమెరికా మిత్ర దేశాలు కూడా అంగీకరించని పరిస్థితులు నెలకొంటున్నాయి. అన్నిటికీ మించి అమెరికా ఇతర దేశాలను లొంగదీసుకోవడానికి తన ఆర్థిక శక్తిని ఆయుధంగా వాడుకోవడం పట్ల సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమౌతోంది. రష్యా, ఇరాక్ వంటి దేశాల ఆస్తులను అమెరికా సెంట్రల్ బ్యాంక్ (ఫెడరల్ రిజర్వ్) స్తంభింపజేయడం చూసి, మిగిలిన దేశాలు అప్రమత్తమవుతున్నాయి.

ఈ పరిణామాల నేపథ్యంలో భారత్ సహా పలు దేశాలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలోనే భారత్ సుమారు 100 టన్నుల బంగారాన్ని అమెరికా నుండి తిరిగి తన స్వదేశానికి తరలించింది. జర్మనీ, ఫ్రాన్స్ వంటి ఐరోపా దేశాలు కూడా ఇదే బాటలో నడుస్తున్నాయి. ఇక చమురు దిగుమతుల విషయంలో డాలర్ పెత్తనానికి కూడా గండి పడింది. డాలర్ స్థానంలో ప్రత్యామ్నాయ కరెన్సీల వాడకం పలు దేశాలు మొగ్గు చూపుతున్నాయి. ఇరాన్, వెనిజులా వంటి దేశాలు ఇప్పటికే చైనాతో యువాన్లలో చమురు వ్యాపారాన్ని సాగిస్తున్నాయి. బ్రిక్స్ కూటమి దేశాలు కూడా డాలర్ తో సంబంధం లేకుండా సొంత చెల్లింపుల వ్యవస్థలను బలోపేతం చేస్తున్నాయి.

ఇక హోర్ముజ్ జలసంధిని ఇరాన్ నిర్ధారించడం వల్ల కూడా డాలర్ విముక్త వాణిజ్యానికి ఊతమిచ్చే పరిస్థితులు ఏర్పడ్డాయి. కేవలం యువాన్ లేదా ఇతర కరెన్సీలలో చెల్లింపులు జరిపే నౌకలనే ఇరాన్ నుమతించడానికి అంగీకరించిన నేపథ్యంలో ఈ పరిస్థితి ఏర్పడింది. ట్రంప్ వార్నింగ్ లతో డాలర్ ప్రాభవాన్ని కాపాడుకోవాలని చూస్తున్నా.. ఆ దేశ పరిస్థితి అందుకు అనుకూలంగా లేదు. త్వరలోనే అంతర్జాతీయ వాణిజ్యంలో డాలర్ ఆధిపత్యం ముగుస్తుందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.

You may also like

Leave a Comment

Jananethram News delivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, Swendaily.com is your trusted source for timely and reliable news

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird