
తెలంగాణలో చికెన్ ప్రియులకు ఇది నిజంగా షాకింగ్ న్యూసే. బుధవారం (ఏప్రిల్ 1) నుంచి రాష్ట్ర వ్యాప్తంగా చికెన్ షాపులు బంద్ కానున్నాయి. ఈ మేరకు చికెన్ షాపుల యజమానుల సంఘం సమ్మెకు రెడీ అయ్యింది. పౌల్ట్రీ కంపెనీల ఏకపక్ష నిర్ణయాలకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చికెన్ షాపుల యజమానుల సంఘం ప్రకటించింది.
ఇప్పటికే హైదరాబాద్‌లోని ప్రధాన కూడళ్లలో, చికెన్ షాపుల ముందు ఈ బంద్‌కు సంబంధించిన పోస్టర్లు వెలిశాయి. కస్టమర్లు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో వ్యాపారులు ఈ మేరకు నోటీసులు, బోర్డులు ఏర్పాటు చేసుకున్నారు. పౌల్ట్రీ కంపెనీలు వారికి ఇచ్చే లాభాన్ని భారీగా తగ్గించేశాయన్నది చికెన్ యజమానుల ప్రధాన ఆరోపణ. చికెన్ అమ్మగా వచ్చే కనీసం లాభం షాపు అద్దెకు, కరెంట్ బిల్లులకు కూడా సరిపోవడం లేదంటున్నారు.
పౌల్ట్రీ కంపెనీలు ఇష్టానుసారంగా, ఏకపక్షంగారేట్లు నిర్ణయిస్తూ తమను నష్టాల్లోకి నెడుతున్నాయని చెబుతున్న చికెన్ షాపుల యజమానులు తమ డిమాండ్‌లు నెరవేరే వరకూ ఉత్పత్తులను తెరిచే ప్రశక్తే లేదని స్పష్టం చేశారు. పౌల్ట్రీ కంపెనీలు దిగి వచ్చి తమ ప్రాఫిట్ మార్చిని పెంచాలని విస్పష్టంగా చెబుతున్నారు. కాగా చికెన్ షాపుల నిరవధిక బంద్ ప్రకటనతో చికెన్ ప్రియులు ఒకింత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఈ విషయంలో జోక్యం చేసుకుని పౌల్ట్రీ కంపెనీలు, వ్యాపారుల మధ్య సయోధ్య కుదరాలని కోరుతున్నారు.

C.E.O
Cell – 9866017966

