Home Latest News ఎరువుల దుకాణాన్ని తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ శ్రీజ పే నుబల్లి మండలంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శ్రీజ పర్యటన

ఎరువుల దుకాణాన్ని తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ శ్రీజ పే నుబల్లి మండలంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శ్రీజ పర్యటన

by Jananethram News
0 comments

ఈ- పాస్ ద్వారా పారదర్శకంగా యూరియా విక్రయం

*జననేత్రం న్యూస్ ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో ఫిబ్రవరి21//: పెనుబల్లి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ పెనుబల్లి మండలంలో విస్తృతంగా పర్యటించారు. మండల కేంద్రంలోని ఎరువుల దుకాణాన్ని అదనపు కలెక్టర్ తనిఖీ చేసి యూరియా స్టాక్ పరిశీలించారు. ఈ- పాస్ యంత్రాల ద్వారా పారదర్శకంగా యూరియా విక్రయం జరగాలని అన్నారు. ప్రతి మండలంలో యూరియా స్టాక్ ను రైతులకు అందుబాటులో పెట్టామని, ఎక్కడా కొరత లేదని అదనపు కలెక్టర్ తెలిపారు.
ఎడ్ల బంజార గ్రామంలో పర్యటించిన అదనపు కలెక్టర్ రైతులతో ముచ్చటించారు. రైతులు సాగు చేస్తున్న పంట వివరాలు, వస్తున్న దిగుబడి, మద్దతు ధర, సన్న వడ్లకు బోనస్ వివరాలు అదనపు కలెక్టర్ తెలుసుకున్నారు. ఆయిల్ పామ్, ఇతర హార్టికల్చర్ పంటలతో రైతులకు వచ్చే అదనపు లాభాలను రైతులకు వివరించారు.
అనంతరం పెనుబల్లి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ విద్యాలయాన్ని సందర్శించి ఆడపిల్లలకు ఆత్మ రక్షణ కోసం అందిస్తున్న సెల్ఫ్ డిఫెన్స్ శిక్షణను పరిశీలించారు. సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకోవడంలో గల లాభాలను అదనపు కలెక్టర్ బాలికలకు వివరించారు.
ఈ పర్యటనలో అదనపు కలెక్టర్ వెంట సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment

Jananethram News delivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, Swendaily.com is your trusted source for timely and reliable news

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird